Sat. Apr 20th, 2024
Plant Nutrition entered Godrej Agrovet

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 26,2020: గోద్రేజ్ అగ్రోవెట్ నేడు తాము నూతన ప్లాంట్ న్యూట్రిషన్ విభాగంలోనికి స్పానిష్ సంస్ధ బయోఇబెర్కాతో భాగస్వామ్యం చేసుకుని ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ఫోర్ట్‌ఫోలియో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్/తెలంగాణా, పంజాబ్, హర్యానా , మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మొక్కలపై ఒత్తిడి తగ్గించడం కోసం పెరుగుతున్న అవసరాలను తీరుస్తుంది. ప్లాంట్ స్ట్రెస్, అది అబయోటిక్ (అసాధారణ ఉష్ణోగ్రతలు, అతి తక్కువ లేదా అధిక వర్షపాతం, కరువు మొదలైనవి) లేదా బయోటిక్ (పురుగుల పడుతుండటం) – వంటివి వాతావరణ మార్పుల ప్రత్యక్ష ప్రభావం చేత కనిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన మొక్కల ఎదుగుదల దశలో ఆ వృద్ధి లేకపోవడమనేది ప్లాంట్ స్ట్రెస్‌కు అతి సహజంగా కనిపిస్తున్న లక్షణం. ఈ కారణం చేత పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయ ఆర్గానిక్ పరిష్కారాలు లేకపోవడం చేత ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని గోద్రేజ్ అగ్రోవెట్ అందిస్తుంది.
బలరామ్ సింగ్ యాదవ్, మేనేజింగ్ డైరెక్టర్, గోద్రేజ్ అగ్రోవెట్ మాట్లాడుతూ “ప్లాంట్ స్ట్రెస్ కారణంగా సృష్టించబడిన వ్యవసాయ సమస్యలు ప్రత్యక్షంగా వ్యవసాయ దిగుబడులపై చూపుతున్నాయి. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం అందించేందుకు తగిన అవగాహనను కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. గోద్రేజ్ ఆగ్రోవెట్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ రైతులకు విభిన్నమైన వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా తోడ్పడడంతో పాటుగా పంట దిగుబడిని వృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది. ఈ క్రమంలోనే ప్లాంట్ న్యూట్రిషన్ పోర్ట్‌ఫోలియోను ఆవిష్కరించాం. నిర్థిష్టమైన పంట, సంభావ్య దిగుబడిని సాధించడానికి ఇది రైతులకు తోడ్పడుతుంది” అని అన్నారు.పంటల వారీగా ప్లాంట్ న్యూట్రిషన్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఉత్పత్తులుఃటెర్రా సోర్బ్ కాంప్లెక్స్ – ద్రాక్ష, యాపిల్, పచ్చిమిరప, బంగాళాదుంప,అర్మూరాక్స్:ద్రాక్ష, యాపిల్, మిర్చీ, ప్రత్తి ఈక్విలిబ్రియం:కూరగాయలు అయినటువంటి టమోటా, వంకాయ, బెండకాయ, పొట్లకాయ, కాప్సికమ్, దోశకాయ, అరటి
ఈ ఉత్పత్తులు మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ/తెలంగాణా, పంజాబ్, హర్యానా, మధ్య ప్రదేశ్‌లలో లభ్యమవుతున్నాయి.