Fri. Mar 29th, 2024
Photo exhibition under the auspices of ROB as part of 'Swatantyra Amrita Mahotsavam' celebrations

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ,మర్చి 13,2021: దేశానికి  స్వాతంత్య్రం వచ్చి 75  సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా  ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా  కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ కు  చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఈ రోజు హైదరాబాద్ సిజిఓ టవర్స్ కవాడిగూడలో చాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ ఏర్పాటు చేసింది.ఆదాయపు పన్ను అప్పీలేట్, ట్రిబ్యునల్ జ్యుడిషియల్ సభ్యురాలు మాధవి దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మాధవి దేవి మాట్లాడుతూ, ఇటువంటి ప్రదర్శనలు, కార్యక్రమాలు మనలో, మన భారతదేశ అద్భుతమైన చరిత్ర,సంస్కృతిని తెలుసుకొని మనలోని  దేశ భక్తి, జాతీయ భావాన్ని పెంపొందేందుకు  సహాయపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.వెంకటేశ్వర్ పిఐబి, డైరెక్టర్ జనరల్ సౌత్ ప్రసంగిస్తూ, భారతదేశంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా మార్చి 12, 1930 న మహాత్మా గాంధీ దండి యాత్రను ప్రారంభించారు. ఈ రోజును పురస్కరించుకొని  ఏర్పాటు చేసిన  ఈ ప్రదర్శన లో  స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుల పాత్ర,   గత 75 సంవత్సరాలలో  స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలకు చెందిన ఛాయా చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

Photo exhibition under the auspices of ROB as part of 'Swatantyra Amrita Mahotsavam' celebrations
Photo exhibition under the auspices of ROB as part of ‘Swatantyra Amrita Mahotsavam’ celebrations

పిఐబి & ఆర్‌ఓబి సంచాలకులు  శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ, ‘స్వాతంత్ర అమృత మహోత్సవం ‘లో  భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ఒబి కి చెందిన క్షేత్ర కార్యాలయాలు వరంగల్, నిజామాబాద్, నల్గొండ లలో కూడా పలు ఛాయా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశాయన్నారు.