దక్షిణ భారత్ మార్కెట్ల కోసం PhonePe బ్రాండ్ అంబాసిడర్‌లుగా దుల్కర్ సల్మాన్, సమంతా ప్రభు

bank Business Featured Posts National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 27,2022: దక్షిణ భారత మార్కెట్ల కోసం పాపులర్ జంట దుల్కర్ సల్మాన్, సమంతా ప్రభును రంగంలో దించామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe తెలిపింది. అలాగే టూవీలర్ ఇన్సూరెన్స్ కోసం సమగ్ర మల్టీమీడియా క్యాంపెయిన్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. PhonePe వేదికలో బైక్ ఇన్సూరెన్స్ రిన్యూవల్స్ కోసం కొత్త విభాగం సృష్టంచి, అందరి దృష్టిని ఆకట్టుకునేలా ముందుకు నడిపే రీతిలో ఈ దేశ వ్యాప్త ప్రచారోద్యమంలో భాగంగా 6 యాడ్ ఫిలింలను ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రియేటివ్‌లు ప్రత్యేకంగా హిందీ మాట్లాడే వారి కోసం అమీర్ ఖాన్, ఆలియా
భట్ లు పాత్రధారులుగా రూపొందించబడింది. దానినే తమిళనాడు, కర్ణాటక, కేరళ,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలిగిన దక్షిణ భారత మార్కెట్ కోసం రూపొందించిన
క్యాంపెయిన్‌లో దుల్కర్, సమంతాలు నటించారు. టీవీలో TATA IPL ప్రసారానికి
అనుబంధ స్పాన్సర్లుగా ఉండడమే కాక, ఈ టివీ క్యాంపెయిన్, OTT,డిజిటల్ ప్రింట్,
సోషల్ మీడియా వేదికల్లోను జులై 2022 వరకు నడుస్తుంది. కీలకమైన సందేశాన్ని అందించేందుకు హాస్య రసాన్ని ఉపయోగించడం ద్వారా భారతదేశంలో బైక్ చోదకులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ క్యాంపెయిన్ వివరిస్తోంది. వారి మధ్య సంభాషణ జరిగే సమయంలో మధ్యలో పాపులర్ సాంగ్స్ తెరవెనుక కామెంటరీలా వినిపిస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ ను కొనడం ద్వారా అంతరాయాలను, అపరాధాన్ని నివారించేలా బైకర్లను ప్రోత్సహించాలనేది ఈ క్యాంపెయిన్ ఆశయం.

The campaign also shows how buying insurance with PhonePeతో ఇన్సూరెన్స్ కొనడం ఎంత సులభం, ఎంత తేలిక, ఎంత చవకనే విషయాన్ని, స్మార్ట్ ఫోన్ ఉంటే కొన్ని మీటలు నొక్కడం ద్వారా చేసుకోవచ్చనే విషయాన్ని కూడా ఈ క్యాంపెయిన్ చూపిస్తోంది.ఈ కొత్త క్యాంపెయిన్ గురించి PhonePe బ్రాండ్ మార్కెటింగ్ డైరక్టర్ రమేశ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, “గత 6 నెలల్లో మేము ఇన్సూరెన్స్ కథలు చెప్పడం ద్వారా మా ఇన్సూరెన్స్ ఉత్పత్తులను మార్కెట్ చేశాము. వినియోగదారులకు పనికి వచ్చే ఉత్పత్తులను ముందుకు తీసుకువచ్చేం దుకు తేలికగా అర్థమయ్యే ప్రచారాన్ని అమలు చేస్తున్నాము. ‘PhonePeలో టెన్షన్ లేని ఇన్సూరెన్స్’ నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా, టూవీలర్ ఇన్సూరెన్స్ పై దృషి పెట్టే ప్రచారాన్ని మేము ప్రారంభించాము.