PhonePeలో రోజుకు 100 మిలియన్లకు పైగా లావాదేవీలు

bank Business covid-19 news Featured Posts Health Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 13,2022:ఒకే రోజున 10 మిలియన్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేశామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల యాప్ PhonePe నేడు ప్రకటించింది. తమ రంగంలో అత్యధిక వినియోగ సేవల విజయవంతమైన రేట్ల నేపథ్యంలో తాము ఈ అసాధారణమైన మైలురాయిని సాధించగలిగామని తెలిపింది. PhonePe, నాణ్యమైన ఇంజనీరింగ్ బృందం ,చిత్తశుద్ధికి, నాణ్యతకు ఇది నిదర్శనమని అభినందించింది. PhonePe ప్రస్తుతం 780 బిలియన్ డాలర్ల వార్షిక TPV రన్ రేట్ తో నెలకు 2.5 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ, భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ వేదికగా నిలుస్తోంది.

ద్వితీయ,తృతీయ శ్రేణి నగరాలు, వాటికన్నా చిన్న పట్టణాలలో వేగంగా దూసుకెళ్ల డం ద్వారా PhonePe అసాధారణ వృద్ధి సాధ్యపడింది. దేశంలోని 99%కు పైగా ఉన్న
19వేలకు పైగా పిన్ కోడ్ లలో యాప్ డిజిటల్ లావాదేవీలకు మద్దతు ఇస్తోంది. ఈ గణనీయమైన వృద్ధి మెరుగైన ఉత్పత్తి అనుభవంతో పాటుగా ఈ వేదికకు వినియోగదా రులు బలంగా ప్రాధాన్యమిస్తున్నారనే విషయానికి స్పష్టమైన సూచికగా నిలుస్తోంది.
ఈ మైలురాయి గురించి, PhonePe CTO,సహ స్థాపకుడు రాహుల్ చారి మాట్లాడుతూ, “ఇది మాకు పెద్ద మైలురాయి. అత్యుత్తమ నాణ్యత కలిగిన పేమెంట్ల విజయవంత రేట్లు, అత్యంత వేగవంతమైన లావాదేవీలు, మెరుగైన ఉత్పత్తి అనుభవంతో దీనిని సాధించాము.

చారిత్రక ప్రవర్తన ప్రాతిపదికన లావాదేవీ విజయవంతం అయ్యే పరిస్థితిని ముందు గానే ఊహించేందుకు మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. 99.99% సిస్టం అప్ టైమ్ అందించడానికి మమ్మల్ని అనుమతిస్తుంది. కోట్లాది మంది భారతీ యులకు ఒక పేమెంట్ల వేదికను నిర్మించడానికి మా కృషిని ఇలాగే కొనసాగిస్తాము. అదే సమయంలో మా విజయంలో మా సాంకేతిక, ఇంజనీరింగ్ బృందాల చిత్తశుద్ధిని,
నాణ్యతను మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాము’’ అని అన్నారు. PhonePe పరిచయం 2015 డిసెంబర్ నెలలో స్థాపించబడిన PhonePe భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్ గా అవతరించింది. వినియోగదారులు, వ్యాపారులు లాంటి వారిని డిజిటల్ మార్గంలో మేళవించే వీలు కల్పించింది. 370 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగిన PhonePeను ప్రస్తుతం ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఉపయోగిస్తున్నారు.

అంతేకాక, దేశంలోని 99శాతం పిన్ కోడ్లను కవర్ చేస్తూ, ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి, అంతకన్నా చిన్న పట్టణాలలోని 30 మిలియన్ ఆఫ్ లైన్ మర్చంట్లను కూడా ఈ సంస్థ డిజిటల్ మయం చేసింది. 2017లో ఆర్థిక సేవల రంగంలోకి అడుగు పెట్టిన PhonePe 24 క్యారెట్ల బంగారాన్ని కొనేందుకు సురక్షితమైన, సులభమైన మార్గాన్ని
అందిస్తోంది. తన వేదికలో ఇటీవల వెండి కొనుగోలును కూడా ఆవిష్కరించింది. అప్పటినుండి, పన్ను ఆదా ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, అంతర్జాతీయ ప్రయాణ బీమా, జీవిత బీమా, కొవిడ్-19 బీమా లాంటి అనేకమైన మ్యూచువల్ ఫండ్స్,ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. PhonePeను ఉపయోగించి, వినియోగదారు లు డబ్బు పంపడం,అందుకోవడం, మొబైల్, DTH రీఛార్జ్ చేయడం, దుకాణాలలో పే చేయడం, తమ వినియోగ పేమెంట్లు అన్నిటినీ చేయడం లాంటివి కూడా చేయవచ్చు.