Thu. Apr 25th, 2024
apples

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 29,2022: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అందరూతినే పండ్లలో అరటిపండ్ల తర్వాత ఆపిల్ పండురెండవ స్థానంలో ఉంది. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్‌ కు దూరంగా ఉండొచ్చనేది ఎప్పటి నుంచో మనవాళ్ళు నమ్ముతున్నారు.

రోజుకో ఆపిల్ పండు తింటే ఎంతవరకు హెల్దీగా ఉండొచ్చు.. అందరూ తినకూడదా..? ఏ ఏ వయసు వాళ్ళు తింటే మంచిది..? నిజానికి ఆపిల్ రోగనిరోధక శక్తిని పెంచే పండే అయినా.. ఆయుర్వేదం ప్రకారం ఒకేరకమైన ఆహారాలు తినకూడదట.

ఒకే రకమైన ఫుడ్ కానీ పండ్లు కానీ తింటే ప్రయోజనా లకు బదులు పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలను పొందేందుకు రోజులో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే తినాలట.

ఆపిల్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. యాపిల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు తగ్గించమే కాకుండా బలాన్ని ఇస్తాయి.

యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అని ప్రచారం జరుగుతుండడంతో.. రోజులో ఒకటి కంటే ఎక్కువ యాపిల్స్ తినేవారు కూడా ఉన్నారు. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ ఫైటోన్యూట్రియంట్స్ వంటివి ఉంటాయి.

apples

ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ యాపిల్స్ తింటే ఆరోగ్యానికి మరింత హానీ కలిగే ప్రమాదం ఉందట.

షుగర్ పేషంట్లలో విషయంలో రాత్రి లేదా సాయంత్రం యాపిల్స్ తింటే పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రేగుల పనితీరుపై భారం పెరుగుతుంది.

అంతేకాదు రాత్రిపూట ఆపిల్‌ తినడం వల్ల గ్యాస్‌ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా తెల్లవారుజామున కడుపులో నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందట. యాపిల్ తో తయారు చేసిన ఆహారపదార్థాల్లో ఒక ముక్కలో 300 నుంచి 400 కేలరీలుంటాయి, 20 గ్రాముల కొవ్వు , 20 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది.

ఇలాంటి ఆహారపదార్థాలతో కార్బోహైడ్రేట్‌లతో తయారు చేస్తారు. కాబట్టి ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

apples

ఒక ఆపిల్‌లో ఎన్ని కేలరీలు ఉంటాయంటే..? యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. ఓ మీడియంసైజు ఆపిల్‌లో 95 కేలరీలుంటాయి. అంతేకాదు ఒక గ్రాము ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్, 19 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్‌ ఉంటాయి.

ఆపిల్‌ తీసుకుంటే95 కేలరీస్ వస్తాయి. 30నిమిషాలు వాకింగ్ లేదా 16 నిమిషాలు రన్నింగ్ చేయడం ద్వారా ఆయా కేలరీస్ ను బర్న్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్

పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం

త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ కు ఆమోదం..

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

చిన్నారుల్లో ఊబకాయానికి ప్రధాన కారణాలు.. ?
శరీరంలో అత్యంత బరువైన అవయవం ఏది..?

CM Jagan entrusted key responsibilities to CS Sameer Sharma