Wed. May 31st, 2023
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్30 ,2021: భారతీయులు ఇప్పుడు అన్ని మెట్రో, బస్సు, రైలు ప్రయాణాలకు, పార్కింగ్, ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్ చెల్లింపులకు మరెన్నో రకాలకు ఒక్క కార్డుతో చెల్లింపులు చేయవచ్చు. ఎన్సీఎంసీ ఇంటర్ ఆపెరబుల్ ఫిజికల్ మొబిలిటీ కార్డు అందిస్తోంది. ప్రభుత్వం వన్ నేషన్ ను ముందుకు తీసుకెళ్లేలా వన్ కార్డ్ ఇన్షియేటివ్. కోట్లాది మంది భారతీయులకు సౌలభ్యాన్ని అందిస్తుంది.ఫాస్టాగ్ విభాగంలో ఇప్పటికే నిరూపిత నాయకత్వ స్థానం ఈ కార్డ్ పేటీఎం వాలెట్ కు లింక్ అయి ఉంటుంది. మెట్రోలు, బస్సులు, రైళ్లలో ప్రయాణం నుంచి టోల్ చెల్లింపు, పార్కింగ్ చార్జీలు, ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్స్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు, ఏటీఎంల నుంచి నగదు కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఈ కార్డును ఉపయోగించుకునేందుకు వినియోగదారులు సులభంగా పేటీఎం వాలెట్ అకౌంట్ ను టాప్ అప్ చేసుకోవచ్చు. ప్రత్యేక ఖాతా ఏదీ నిర్వహించనక్కర్లేదు. మొదటి దశ హైదరాబాద్ మెట్రో రైల్, అహ్మదాబాద్ మెట్రో, దిల్లీ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ లతో కలసి పనిచేయడంతో ప్రారంభమవుతుంది. వీటి వద్ద యూజర్లు తిరుగులేని విధంగా లావాదేవీలు నిర్వహించవచ్చు. భారతదేశానికి చెంది, స్థానికంగా వృద్ధి చెందిన పేమెంట్స్ బ్యాంక్ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) నేడిక్కడ పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ ను ఆవిష్కరించింది.

వన్ నేషన్, వన్ కార్డ్ శక్తిని ఒక్క చోటుకు చేర్చింది. కోట్లాది మంది భారతీయులను వారి రోజువారీ కార్యకలాపాల కోసం భౌతిక కార్డు తో శక్తివంతం చే యడం బ్యాంక్ లక్ష్యం. మెట్రో, రైల్వేలు, ప్రభుత్వ యాజమాన్యంలోని బస్ సర్వీసులు, టోల్, పార్కింగ్ చార్జీ లు, ఆఫ్ లైన్ దుకాణాల్లో చెల్లింపులు, ఆన్ లైన్ షాపింగ్, ఇంకా మరెన్నో అవసరాలు వీటిలో ఉన్నాయి. ఏ టీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు కూడా ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఈ ఆవిష్కరణతో యూజ ర్లు ఇక వేర్వేరు ప్రయోజనాల కోసం పలు రకాల కార్డులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తాము చేసే అన్ని రకాల పేమెంట్లకు గాను పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ ను వెంట ఉంచుకుంటే చాలు.

పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ ను ఆవిష్కరించడం అనేది బ్యాంకింగ్, లావాదేవీలకు సంబంధించి భారతీయులంతా తిరుగులేనివిధంగా ఉపయోగించుకోగలిగిన ఉత్పాదనలను అందించాలన్న బ్యాంక్ ఇన్షియేటివ్స్ కు అను గుణంగా ఉంది. బ్యాంకు పటిష్ఠ సాంకేతికత, విస్తృత యూజర్ బేస్ తో పీపీబీఎల్ భారీస్థాయిలో పేటీఎం ట్రా న్సిట్ కార్డ్ ను వాడుకలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. అది ఎన్సీఎంసీ, డిజిటల్ ఇండియా కార్య క్రమాలకు మరింతగా ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఇది అప్లై చేసేందుకు, రీచార్జ్ చేసేందుకు, కార్డుల అన్ని లావాదేవీలను ట్రాక్ చేసేందుకు పేటీఎం యాప్ పైన నే పూర్తిగా డిజిటల్ ప్రక్రియను రూపొందించింది. ఈ ఫిజికల్ కార్డు యూజర్ ఇంటి వద్దనే డెలివరీ చేయ బడుతుంది లేదా నిర్దేశిత సేల్స్ పాయింట్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీపెయిడ్ కార్డు నేరుగా పేటీఎం వాలెట్ కు లింక్ చేయబడి ఉంటుంది. ట్రాన్సిట్ కార్డ్ ఉపయోగించేందుకు యూజర్లు వాలెట్ కు టాప్ అప్ చేయించుకుంటే చాలు. ఏవిధమైన ప్రత్యేక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ హైదరాబాద్ మెట్రో రైల్ తో కలసి ఆవిష్కరించబడింది. హైదరాబాద్ లోని యూజర్లు ఇ ప్పుడు తేలిగ్గా ఈ ట్రాన్సిట్ కార్డ్ ను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఆటోమేటిక్ ఫే ర్ కలెక్షన్ (ఏఎఫ్ సి) గేట్స్ వద్ద వీటిని డిస్ ప్లే చేస్తే సరిపోతుంది. మెట్రో, బస్, రైలు సర్వీస్ లను ఉప యోగించే 50 లక్షల మంది ప్రయాణికులకు ఈ సర్వీస్ తోడ్పడనుంది. తిరుగులేని అనుసంధానతను అం దిస్తుంది. ఈ కార్డు ఇప్పటికే దిల్లీ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్, అహ్మదాబాద్ మెట్రోలో ఉపయోగించబడు తోంది. పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ తో ప్రజలు అదే కార్డును మెట్రోల్లో, అదే విధంగా దేశవ్యాప్తంగా మెట్రో స్టేషన్ల లోనూ ఉపయోగించవచ్చు.

ఈ సందర్భంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ సతీశ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘పేటీఎం ట్రా న్సిట్ కార్డ్ ఆవిష్కరణ కోట్లాది మంది భారతీయులను ఒక్క కార్డుతో శక్తివంతం చేస్తుంది. అది రవాణాతో పా టుగా బ్యాంకింగ్ అవసరాలను కూడా తీరుస్తుంది. ఇది ఆర్థిక చేకూర్పును, యాక్సెసబిలిటీని అందరికీ అంది స్తుంది. ఎన్సీఎంసీ ఇన్షియేటివ్ లో భాగమైనందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాం. ఈ స్మార్ట్ మొబిలిటీ సొ ల్యూషన్స్ ను ముందుకు తీసుకెళ్తూ, దేశంలో ట్రాన్సిట్ ఎకో సిస్టమ్ డిజిటైజేషన్ దిశగా పని చేయడాన్ని కొ నసాగిస్తాం’’ అని అన్నారు. పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ అనేది మాస్ ట్రాన్సిట్ విభాగంలో బ్యాంక్ రెండో ఉత్పాదన. ఇందులో మొదటిది విజయవంతమైన పీపీబీఎల్ ఫాస్టాగ్స్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది దేశంలో 1 కోటికి పైగా ఫాస్టాగ్స్ ను జారీ చేసిన మైలురాయిని సాధించిన మొదటి బ్యాంక్. ఈ బ్యాంక్ జాతీయ, రాష్ట్ర రహదారులపై 280 టోల్ ప్లాజాలను టోల్ చార్జీలను డిజిటల్ గా కలెక్ట్ చేసేందుకు వీలుగా చేసింది.