Thu. Apr 25th, 2024
pasupuleti-hariprasad

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబర్ 4,2022:జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రాణహాని పెరుగుతోందని, ఆయన భద్రత కోసం ‘జెడ్’ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బలమైన ప్రజాభిప్రాయాన్ని రూపొందించేందుకు ప్రజల వద్దకు వెళ్లనుందని జనసేన అధికార పార్టీ నాయకులు, అన్నమయ్య తిరుపతి జిల్లా జేఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.

హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ ఇంటివద్ద అనుమానిత వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై స్పందిస్తూ.. ‘సేవ్ పవన్ సేవ్ ఆంధ్రా’ నినాదంతో జనసైనికులు (పార్టీ కార్యకర్తలు)పవన్ భద్రత కోసం ప్రజల మద్దతు కోరుతున్నామని ఆయన అన్నారు. పవన్‌ కళ్యాణ్ కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించేలా సెక్యూరిటీని పెంచాలని కేంద్రాన్ని పసుపులేటి హరిప్రసాద్ డిమాండ్‌ చేశారు.

pasupuleti-hariprasad

ఆయన భద్రతపై ఏపీ పోలీసులు నోరు మెదపకపోవడం దారుణమని, వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పాలక నాయకులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పవన్‌కు లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించు కోలేకపోతున్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ అకృత్యాలను బయటపెడుతూ అధికార పార్టీ నేతల అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జనసేన కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే జనసైనికులు ఊరుకోరని హెచ్చరించారు. తమ నాయకుడికి అనుకూలంగా సర్వేలు వెల్లడికావడంతో పవన్ కళ్యాణ్ పై దాడి చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న సీఎం, అధికార పక్షం, పవన్‌పై జరుగుతున్న కుట్రను బీజేపీ, కూటమి భాగస్వామ్య నాయకులు బహిరంగంగా ఖండించాలని ఆయన కోరారు. పవన్ భద్రతకోసం పార్టీ హైకమాండ్ తో చర్చించి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించేలా బీజేపీ నేతలు చూడాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జేఎస్పీ నాయకులు రాజారెడ్డి, బాబ్జీ, మునస్వామి పాల్గొన్నారు.