Fri. Apr 26th, 2024
PAVITROTSAVAMS IN KR
PAVITROTSAVAMS IN KRT
PAVITROTSAVAMS IN KRT

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 26,2021:తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 4నుంచి 6వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగ‌స్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, మేదినీ పూజ‌, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

PAVITROTSAVAMS IN KRT
PAVITROTSAVAMS IN KRT

ఇందులో భాగంగా ఆగ‌స్టు 4న‌  మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగ‌స్టు 5న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఆగ‌స్టు 6న మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 11నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం జ‌రుగ‌నుంది. సాయంత్రం ఆల‌యంలో ఊరేగింపు నిర్వహిస్తారు.

PAVITROTSAVAMS IN KRT
PAVITROTSAVAMS IN KRT

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.