దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో ఎక్కువ తెలంగాణకు చెందినవే..

Business Featured Posts Health Life Style National tech news Technology Top Stories Trending
Spread the News

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 27, 2021:డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, APLSA (TS & AP రాష్ట్రాలు కలిపి) 25 అక్టోబర్ 2021 నుంచి 1 నవంబర్ 2021 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ని జరుపుకుంటుంది. వేడుకలలో భాగంగా జె.వి.రాజారెడ్డి (అడ్మినిస్ట్రేషన్), APLSA, (తెలంగాణ & ఆంధ్ర) టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ , హైదరాబాద్ ప్రజల సాధారణ అవగాహన, భద్రత కోసం మొబైల్ సంబంధిత భద్రతపై ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్‌ క్రైమ్‌ కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, దేశవ్యాప్తంగా నమోదైన సైబర్‌ నేరాల్లో10శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రంలోనే నమోదైనట్లు తెలిపారు. మన జనాభాలో దాదాపు 50శాతం మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని చైనా తర్వాత ఆన్‌లైన్ వ్యాపారంలో మనం 2వ స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు.
అమాయక ప్రజానీకం కష్టపడి సంపాదించిన డబ్బును మోసం చేస్తున్న రోజుల్లో వివిధ ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నందున మొబైల్ సంబంధిత సెక్యూరిటీ అంశాల గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం ప్రాముఖ్యతను (టెలికాం సెక్యూరిటీ)డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.గౌరీ శంకర్ ITS వివరించారు.

అవగాహన కరపత్రం ఓటీపీ మోసాలు కేవైసీ మోసాలు, క్యూఆర్ కోడ్ మోసాలు, స్మార్ట్‌ ఫోన్ స్మిషింగ్, మొబైల్ టవర్ మోసాలు, నకిలీ కాల్ సెంటర్ మోసాలు, సెక్స్‌టార్షన్ నేరాలు, రుణం, బహుమతి, ఉద్యోగ మోసాలు మొదలైన వాటితో పాటు ముందస్తు జాగ్రత్తలు, ఫిర్యాదులు వంటి అత్యంత సాధారణంగా గమనించిన మోసాలను వివరిస్తుంది. రిపోర్టింగ్ మెకానిజం, ముఖ్యమైన చేయవలసినవి, చేయకూడనివి కూడా ఈ కరపత్రంలో వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ITS, DDG (కాంప్లియన్స్) జి. వి.రమణ రావుపాల్గొన్నారు.