Sat. Apr 20th, 2024
P. Vijaya Babu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,అక్టోబర్ 29,2022: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆర్టిఐ మాజీ కమిషనర్ పి.వి.విజయ్ బాబును నియమిస్తూ ఏపీ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా ఉత్తర్వులను సైతం తెలుగులోనే ఇవ్వడం విశేషం.

సీనియర్ జర్నలిస్టు అయిన విజయబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ గా కూడా సేవలందించారు. ఇటీవల ఎన్ఠీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరుమార్చడంతో ఈ నేపథ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆ పదవికి రాజీనామా చేశారు.

P. Vijaya Babu

అయితే.. యార్లగడ్డ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విజయబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు.

సీనియర్ జర్నలిస్ట్ గా విజయబాబు గతంలో పలు దినపత్రికల్లో పనిచేశారు. అంతేకాదు ఆంధ్రప్రభ ఎడిటర్ గా తనదైన ముద్రవేశారు. మీడియా రంగంలో విశేష సేవలు అందించారు. అధికార బాషా సంఘం అధ్యక్షులుగా నియమితులైన విజయ్ బాబుకు పలు జర్నలిస్టుసంఘాలు శుభాకాంక్షలు తెలిపాయి.