Thu. Apr 25th, 2024
Ohris "Eatmore" introduced the new menu

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,19 డిసెంబర్‌, 2020 :ఓహ్రీస్‌ ఈట్‌మోర్‌ ఉత్సాహపూరితమైన డిషెస్‌ను తమ మెనూకు ఈ శీతాకాలపు సీజన్‌ కోసం జోడించింది. అద్భుతమైన రుచులతో ఆహ్లాదకరమైన మెనూకు పెట్టింది పేరు ఈట్‌మోర్‌. ఎంచుకోవడానికి ఆస్వాదించడానికి వినియోగదారులకు అపారమైన రుచులు ఈట్‌మోర్‌ వద్ద వినియోగదారులకు లభ్యమవుతాయి. ఇప్పుడు వారు ఇప్పటికే ఆసక్తికరమైన తమ మెనూకు మరిన్నిడిషెస్‌ను జోడించారు.

Ohris "Eatmore" introduced the new menu
Ohris “Eatmore” introduced the new menu

భోజనప్రియులు అభిమానించే రుచులు ఇప్పటికీ మెనూలో ఉన్నప్పటికీ, శాఖాహార ,మాంసాహార మెనూలో మరిన్ని అవకాశాలు ఇప్పుడు లభిస్తున్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన ఫేవరేట్స్‌లో సల్సాతో నాచో ; స్పైసీ గార్లిక్‌ బ్రెడ్‌, సుప్రీమ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌లు, చిల్లీ గార్లిక్‌ మష్రూమ్స్‌, పెరీ పెరీ చికెన్‌ వింగ్స్‌, పెరీ పెరీ చికెన్‌ శాంచ్‌విచ్‌,సిరాచా మిక్స్‌ మీట్‌ పిజ్జా,హైదరాబాద్‌ కీమా మటర్‌ , మరెన్నో ఉన్నాయి. ఈ నూతన మెనూనువినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. వీరు త్రీ కోర్స్‌ మీల్స్‌ లేదంటే కొంతమంది క్యాజువల్‌డిన్నర్‌కు వచ్చినా వారి అభిరుచులను పరిగణలోకి తీసుకుని రూపొందించారు.

Ohris introduced the latest menu "Eatmore"
Ohris introduced the latest menu “Eatmore”

నూతన ఈట్‌మోర్‌ మెనూను రోజంతా వడ్డిస్తారు. ఔట్‌లెట్ల వద్ద మాత్రమే కాదు హోమ్‌ డెలివరీగా కూడా ఈ రుచులను ఆస్వాదించవచ్చు. ఈ మెనూను ప్రత్యేకంగా రుచి , అనుభవం పరిగణలోకి తీసుకుని తీర్చిదిద్దారు. ‘‘మెనూకు అదనపు రుచులను జోడిస్తున్నామని తెలుపడానికి మెమంతగానో సంతోషిస్తున్నాము. ఇది మా వినియోగదారులకు ప్రతి సారీ ఒకే తరహా డిషెస్‌కు కట్టుబడే
అవకాశమివ్వదు. అత్యున్నత స్థాయి భద్రత , పరిశుభ్రతప్రమాణాలనుమేముఅనుసరించగలమనిభరోసానందించడంతో పాటుగా మా అభిమానులందరికీ మరుపురాని అనుభవాలను అందించగలమని ’’ ఓహ్రీస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమర్‌ ఓహ్రీ అన్నారు.