
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మే8,2022 : ఎస్ఎంఎస్ ఫౌండేషన్, ఓజి పుడ్స్ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మదర్స్ డే సెలెబ్రేషన్స్ ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు జీడిమెట్ల లోని లయన్స్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన 50 మంది మాతృమూర్తులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి ఎస్ఎంఎస్, మన నేస్తం ద్వారా మహిళల అభివృద్ధి పై చర్చించారు. అంతేకాకుండా వోజీ ఫుడ్స్ ద్వారా మహిళలకు పౌష్టికాహార ప్రాము ఖ్యతను తెలియజేస్తూ వారికి ఆర్గానిక్ పుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో పది రకాలకు పైగా ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్ తో తయారు చేసిన వంటకాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ నటీ రోజారమణీ, ఎస్ఎంఎస్ ఫౌండేషన్ ఫౌండర్, అవార్డ్ విన్నింగ్ రియల్టర్ జూపల్లి మంజుల రావు , ఓజీ నాచురల్ ఫుడ్స్ ఫౌండర్, మహిళా వ్యాపారవేత్త దీప్తి రెడ్డి మడుగుల, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మాతృమూర్తి లీల రాజ్ విచ్చేసి వారి అనుభవాలను తోటి మహిళలతో పంచుకున్నారు.



తల్లే పిల్లలకు మొదటి గురువు కాబట్టి ప్రతి ఒక్కరి భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుందని, నేటి 5జీ యుగంలో పిల్లలను పెంపకంలో తల్లి ఎంతో జాగ్రత్తతో ఉండడమే కాకుండా, ఎప్పటికప్పుడు పిల్లల ఆలోచనలను, అవసరాలను గమనిస్తూ వారితో స్నేహితురాలిగా మెలుగుతూ మంచి,చెడులను తెలియజేస్తూ పెంచాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటీ రోజారమణీ ఓజీ న్యాచురల్ ఫుడ్స్ పోస్టర్ ను లాంఛ్ చేశారు.

