గాలి నాణ్యతను గురించి ఆలోచించడం ప్రారంభించడానికి ఇది సరైన సమయం !

Business Featured Posts Health National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 11,2022:గాలి కాలుష్యం:మనమెప్పుడూ కూడా ఆందోళన చెందే అంశమిది. గాలి కాలుష్య నగరాలలో మన నగరం ఉందేమోనని భయపడి వెదకడమూ జరుగుతుంది ! ఇది నిత్యం చర్చ జరిగే అంశం మాత్రమే కాదు ఆందోళన కలిగించే అంశం కూడా ! మనం గుర్తించినా, గుర్తించకపోయినా గాలి కాలుష్యం మాత్రం మనందరిపైనా తీవ్ర ప్రభావం
చూపుతుందన్నది మాత్రం వాస్తవం. భారతీయ కుటుంబాలలో తరచుగా నిర్లక్ష్యం చూపే అంశమిది. ఈ గాలి కాలుష్యం తనతో పాటుగా తీసుకువచ్చే ప్రమాదాలను తగ్గించడంలో అత్యంత ఆప్రమప్తతతో వ్యవహరించాల్సి ఉండటానికి ఎన్నో
కారణాలు ఉన్నాయి.

కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ గాలి కాలుష్యం గురించి వాస్తవంగా ప్రజలకు తెలిసింది ఎంత మేరకు?ఇక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రశ్నలకు డైసన్‌ ఎన్విరాన్‌మెం టల్‌ కేర్‌ –డిజైన్‌ మేనేజర్‌ ముజాఫర్‌ ఇజాముద్దీన్‌ సమాధానాలను అందిస్తూనే గాలి కాలుష్యం, గాలి నాణ్యత గురించి కొన్ని అంశాలను సైతం ముచ్చటించారు.

1.గాలి కాలుష్యం కనబడుతుందా ?

అవును.కానీ ఈ కాలుష్యాన్ని పొగమంచు లేదా తేమతో ఉన్నప్పుడు స్పష్టంగాచూ డగలము .మనం తరచుగా మరిచిపోయే అంశమేమిటంటే కంటికి కనిపించే కాలుష్యం మాత్రమే ప్రమాదకరమైన కాలుష్యం కాదు. దీనితో పాటుగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, సైతం వావాతవరణంలో సంవత్సరమంతా ఉంటాయి. ఇవి కూడా అత్యంత ప్రమాదకరమైనవి.

2.ఆరుబయట కాలుష్యం అధికంగా ఉంటుందా ? ఇంట్లో ఉండటం సురక్షితమేనా ?

ఇల్లు ఎప్పుడూ సురక్షిత స్వర్గమేమీ కాదు. ఇండోర్‌ గాలి కాలుష్యం కూడా ఆరు బయట కాలుష్యంతో పోలిస్తే తీవ్రంగా ఉంటుంది. కాలుష్యమనేది మనం రోజువారీ ఇంటిలో చేసే పలు కార్యక్రమాల వల్ల కూడా ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ కాలుష్యం ఆరు బయట నుంచి లోపలకు ప్రవేశించవచ్చు. అలాగే ఉపరితలాల నుంచి ఉద్భవించవచ్చు. చివరకు విభిన్నమైన కాలుష్య కారకాల సమ్మేళనంగా కూడా ఇది జనించవచ్చు. గాలి కాలుష్యం ఇంటిలోకి చేరకుండా అంటూ మనం మొత్తం మన ఇంటిని సీల్‌ చేసుకుటుంటాం కానీ వాస్తవమేమిటంటే, ఆ కాలుష్యం బయటకు పోకుండా లోపల దాస్తున్నాము.

ప్రతి రోజూ మనం దాదాపు 9వేల లీటర్ల గాలి1ని శ్వాసిస్తుంటాము,90% వరకూ క్లోజ్డ్‌ డోర్స్‌2 నడుమ గడుపుతుంటాము. రోజువారీ ఇంటి పనులు అయినటువంటి వీఓసీలు (వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌) తో డియోడరెంట్‌లు, సుగంధ పరిమళాలు దట్టించిన కొవ్వొత్తులు, క్లీనింగ్‌ సాల్వెంట్స్‌ వంటి వాటి వల్ల ఇంటి లోపల గాలి
కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇతర ప్రధానమై గాలి కాలుష్య కారాలలో వంట వల్ల విడుదలయ్యే వాయువులు, సెంట్రల్‌ హీటింగ్‌, మౌల్డ్‌, అలెర్జెన్స్‌, పొలెన్‌, పెంపుడు జంతువుల నుంచి రాలే జుట్టు లేదా భారీగా ఉత్పత్తి చేసిన ఫర్నిచర్‌ నుంచి ఫార్మాల్డీ హైడ్‌ ఉన్నాయి. మనం ఇంటిలో ఉన్నా లేదంటే ఆఫీసులో ఉన్నా మనం హానికరమైన గాలిని పీలుస్తూనే ఉంటాం. హెపా,యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్‌తో కూడిన ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను కలిగి ఉండటం ద్వారా గాలి కాలుష్యకారకాలతో పాటుగా విష వాయువులను సైతం ఒడిసిపట్టుకోవడం సాధ్యమవుతుంది,ఇంటి లోపలి గాలి కాలుష్యాన్ని వీలైనంత వరకూ మెరుగుపరుచుకోవడమూ సాధ్యమవు తుంది.

3.ఏది ప్రమాదకరమైనది – ఇండోర్‌ కాలుష్యం లేదా ఔట్‌డోర్‌ కాలుష్యం ?

ఇండోర్‌, ఔట్‌డోర్‌ గాలి కాలుష్యాలను తరచుగా రెండు ప్రత్యేక అంశాలు గా పరిగణిస్తుంటారు. కానీ ఔట్‌డోర్‌ గాలి కాలుష్య కారకాలు అయినటువంటి వాహనాల నుంచి విడుదలయ్యే వాయువులు, పొలెన్‌, మౌల్డ్‌ స్పోర్స్‌ వంటివి ఇంటి లోపల ప్రాంగణాలలోకి కూడా ప్రవేశిస్తాయి.ఒకసారి అవి లోపలకు వస్తే , ఇండోర్‌ కాలుష్య
కారకాలతో కలిసి అవి స్పందించడం చేస్తాయి. అవి సంక్లిష్టమైన మురికి గాలి ఉత్పత్తి కావడానికి కూడా కారణమవుతాయి. ఇదే రీతిలో, ఇండోర్‌ గాలి కాలుష్యకారకాలు అయినటువంటి కట్టెల నుంచి వచ్చే పొగ లేదా వంట చేయడం వల్ల వచ్చే వాసనలు వంటివి వెంటిలేషన్‌ద్వారా బయటకు పోతాయి. ఈ నిరంతర ప్రక్రియలు ఇండోర్‌
,ఔట్‌డోర్‌ పొల్యూటెంట్స్‌ నడుమ వైవిధ్యతను తగ్గిస్తాయి. కానీ సరైన అవగాహన ఉంటే, హానికరమైన గాలి భవంతుల లోపలకు రాకుండా ఇంటిలోపల మనం తగిన ఏర్పాట్లు చేసుకోగలము. ఉదాహరణకు మన ఇంటి లోపలి గాలిని ఎయిర్‌ ఫ్యూరిఫైయ ర్‌తో నియత్రించగలము.

4.కాలుష్యమనేది సీజనల్‌గా వచ్చే సమస్యా ?

ఇది 365రోజుల సమస్య ! విభిన్న సీజన్‌లలో నిర్థిష్టమైన గాలి కాలుష్య కారకాలు పెరుగుతాయి. దీనికి ఉష్ణోగ్రత,వాతావరణం, మానవ కార్యకలాపాలు కారణమవుతాయి. గాలి నాణ్యత రోజు రోజుకీ దిగజారడమన్నది అంతర్జాతీయంగాసమస్యగా పరిణమించింది . తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో ఇండియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో 50 అత్యంత కాలుష్య నగరాలలో3 37 భారతదే శంలోనే ఉన్నాయి. ఇది గాలి కాలుష్యంను మనం నిర్లక్ష్యం చేయడాన్ని ఎత్తి చూపుతుంది. దానితో పాటుగా స్వచ్ఛమైనగాలిని సంవత్సరమంతా పొందాల్సిన ఆవశ్యకతను తెలుపుతుంది.

5.గాలి కాలుష్యం మన జీవితాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది ?

గాలి నాణ్యత అనేది అత్యంత క్లిష్టమైన సమస్య. దీని ప్రభావానికి పలు అంశాలు కూడా దోహదపడతాయి. అవి వయసు,ప్రాంతం, ఆరోగ్యం, ఒకరు ఎంత చురుగ్గా ఉన్నారు,ఆ కాలుష్య ప్రభావానికి ఎంత సేపు గురవుతున్నారు లాంటి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. డైసన్‌ వద్ద, మేము ఇండోర్‌ గాలి కాలుష్య ప్రభావం గురించి విస్తృతశ్రేణి పరిశోధనలు చేస్తున్నాము. ప్రతి రోజూ మనం 9వేల లీటర్ల గాలిని శ్వాసిస్తుండటంతో పాటుగా 90% కు పైగా మన సమయాన్ని మూసిన తలుపుల వెనుకనే గడుపుతున్నాము. ఆఖరకు లాక్‌డౌన్‌ముందు నుంచి కూడా జరిగింది ఇదే ! ఇండోర్‌ గాలి కాలుష్యం కారణంగా ఎదురైన నిర్థిష్టమైన వైద్య ప్రభావం గురించి అధ్యయనం చేసినప్పుడు, ఎక్స్‌పోజర్‌ సమయం అత్యంత కీలకమైన అంశం అని తెలుసుకున్నాము. అందువల్ల ఇండోర్‌ గాలి నాణ్యత, లాజికల్‌గా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి ముఖ్య కారణం మనం ఇంటి లోపలే అధిక సమయం గడపడం.

6.ఏక్యుఐ/ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ అంటే ఏమిటి ? ఏక్యుఐ ర్యాంకింగ్స్‌ పట్ల ఆప్రమప్తతతో ఎందుకు వ్యవహరించాల్సి ఉంది ?

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యుఐ) అనేది రోజువారీ పద్ధతిలో గాలి నాణ్యతను నివేదించే సూచిక. స్వల్పకాలంలో గాలి కాలుష్యం ఏ విధంగా ఒకరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని గుణించేందుకు తోడ్పడుతుంది. ఏక్యుఐ ప్రధాన
లక్ష్యం ఏమిటంటే, ఏ విధంగా గాలి నాణ్యత అనేది ఒకరి ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది తెలుసుకోవడంలో ప్రజలకు సహాయపడటం. ఇది 0–500 నడుమ ఉంటుంది. ఏక్యుఐ విలువ అధికంగా ఉంటే, గాలి కాలుష్యం అధికంగా ఉన్నట్లుగా గుర్తించాలి. దీనివల్ల ఆరోగ్యసమస్యలు కూడా అధికంగా ఉంటాయి. ఏక్యుఐ నేపథ్యంను

అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా వినియోగిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడ ఏక్యుఐ గుణిస్తున్నారు. ఏక్యుఐ ద్వారా అత్యంత వేగంగా గాలి నాణ్యత సమాచారం వాస్తవ సమయంలో తెలుసుకోవచ్చు.

7.ఆరోగ్యవంతమైన ఏక్యుఐ సాధించేందుకు కొన్ని సూచనలేమిటి ?

మనం బయట శ్వాసించే గాలి నాణ్యత వృద్ధి చేయడానికి మనవంతుగా కొంత ప్రయత్నం చేయవచ్చు. కానీ మనం ఈ సూచనలను మన ఇంటిలో గాలి కాలుష్యం లేకుండా చేసుకునేందుకు వినియోగించవచ్చు.
. క్లీనింగ్‌ ఉత్పత్తులను తెలివిగా వినియోగించండి మన ఇంటిలో కనుగొనబడే కొన్ని రకాల వీఓసీలు క్లీనింగ్‌ ఉత్పత్తులలో వినియోగించే రసాయనాల వల్ల ఉత్పన్నమ వుతాయి. మనం కిచెన్‌ ఉపరితలాలు, బాత్‌రూమ్‌లు, కిటికీలుపై వీటిని వినియోగిస్తుం టాము. సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఉత్పత్తులను వాడటం వల్ల మీ ఇండోర్‌ గాలిలో వీఓసీల మొత్తం తగ్గించడం వీలవుతుంది.
.తరచుగా వాక్యూమ్‌ చేయాలి మీ సోఫా లేదా కుషన్‌తో మీరు ఆడుకున్నప్పుడు గాలిలోకి పెద్ద ఎత్తున దుమ్ము లేవడం చూసేఉంటారు. ఈ ధూళి ఇంటిలోపల ఉండటంతో పాటుగా మనం శ్వాసించేందుకు కూడా కారణమవుతుంది. అయితే తరచుగా వాక్యూమింగ్‌ చేయడం ద్వారా ఇంటి లోపల గాలి కాలుష్యం అతి సులభంగా తగ్గించడం వీలవుతుంది.

.కొద్ది పరిమాణంలో అత్తరులు వాడాలి ఇంటిలోపల మనం ఆస్వాదించతగిన రీతిలో ఉండేటటువంటివి సెంటెల్‌ క్యాండిల్స్‌. ఇండోర్‌ గాలి కాలుష్యం కు ఇవి అతి పెద్ద వనరుగా నిలుస్తాయి. క్యాండిల్స్‌ను ఏకధాటిగా వెలిగించి వదిలేయకుండా కొద్ది పరిమాణంలో, సాధారణంగా సాయంత్రాలు వాటిని కాస్సేపు వాడి పక్కన పెట్టడం ఉత్తమం.
.తాజా గాలి లోపలకు రానిచ్చే వేళ కాస్త ఆప్రమప్తంగా ఉండండి ఒకవేళమీరు అత్యధిక ట్రాఫిక్‌ కలిగిన ప్రదేశంలో లేదంటే బిజీరోడ్‌లో నివాసముంటే, కిటికీ తెరిచి ఆహ్లాదకరమైన గాలి పొందుదామనుకుంటే బాహ్య కాలుష్యం, గ్యాస్‌లు అయిన నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ మరియు సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ ను మీ ఇంటిలోకి ఆహ్వానించినట్లే.

.వంట చేసేటప్పుడు తగినంతగా వెంటిలేషన్‌ ఉండాలి ఆయిల్‌లోవేయించేటప్పుడు నిర్దిష్టమైన కాలుష్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్‌ స్టవ్‌ వాడటం వల్ల కూడా వాయుకాలుష్యం ఏర్పడవచ్చు.మరీముఖ్యంగా నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ లాంటివి ఉత్పత్తి కావొచ్చు. వంటచేసేటప్పుడు వంట పాత్రలు ఔట్‌డోర్‌లో ఉండేలా చూసుకోవాలి లేదా బయట గాలి స్వచ్ఛమైనది అయితే కిటికీలను తెరిచి ఉంచుకోవాలి. తద్వారా కాలుష్య గాలిని బయటకు పంపడం సాధ్యమవుతుంది అలా వీలు కానప్పుడు మెకానికల్‌ వెంటిలేషన్‌ అయినటువంటి ఫ్యూరిఫైయింగ్‌ ఫ్యాన్‌తో గాలి కాలుష్య కారకాలు బయటకు పంపవచ్చు.
.ఎయిర్‌ ప్యూరిఫయర్‌ వినియోగించడం ఓ చక్కటి ఎయిర్‌ ప్యూరిఫయర్‌ కేవలం అలెర్జిన్స్‌ను ఒడిసి పట్టడం మాత్రమే కాదు, గాలి కాలుష్య కారకాలైన పొల్యూటెంట్స్‌ను పీఎం 0.1 వరకూ ఒడిసిపట్టవచ్చు.దీనితో పాటుగా హానికారక వాయువులు అయిన వీఓసీలు, నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ మొదలైన వాటిని సైతం
ఒడిసి పట్టడం ద్వారా గది మొత్తం ప్యూరిఫై చేయవచ్చు.