డిజిటలైజేషన్ లో ముందుకు దూసుకువెళుతున్న ఈశాన్య భారతం: PhonePe Pulse 2022 మొదటి త్రైవార్షిక డేటా

bank Business Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,మే 11,2022:మొదటి త్రైమాసికం (జనవరి-మార్చ్)కు డిజిటల్ పేమెంట్ ట్రెండ్స్ ను భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ వేదిక PhonePe నేడు విడుదల చేసింది.ఖచ్చితమైన,సమగ్రమైన డేటా కోసం భారతదేశపు ఏకైక గమ్యస్థానంగా, తాజా PhonePe Pulse ట్రెండ్స్ దేశంలోని డిజిటల్ పేమెంట్లపై ఆసక్తికరమైన పరిశోధన ఫలితాలను వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో P2P, P2M లావాదేవీల్లో పెరుగుదల కనిపించింది.

అలాగే పేమెంట్ పరిమాణాలు, రిజిస్టర్డ్ వినియోగదారుల సంఖ్య పరంగా కూడా బలమైన వృద్ధి కనిపించడంతో డిజిటల్ పేమెంట్ల విషయంలో అలాగే ముందుకు వెళుతున్నట్టు సూచనలు వస్తున్నాయి.PhonePe Pulse Q1 డేటా నుండి కొన్ని కీలక హైలైట్లను లోతుగా పరిశీలిస్తే కింది అంశాలు కనిపిస్తాయి:ఈశాన్య ప్రాంతం (NER) 2022 మొదటి త్రైమాసికంలో డిజిటల్ లావాదేవీలలో వృద్ధిని ముందుకు నడిపిస్తోం ది: ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక నివేదిక ప్రకారం, UPI ఇప్పుడు జనరంజక పేమెంట్ విధానంగా తయారైంది. ఈశాన్య భారతంలో ఉన్న మొత్తం 15 లక్షల మంది మర్చంట్లలో 58% మంది డిజిటల్
మార్గానికి మారారు. ఈశాన్య ప్రాంతంలో కనిపించే ఈ డిజిటల్ పేమెంట్స్ ధోరణుల వైవిధ్యభరితమైన వినియోగ సందర్భాలపై PhonePe Pulse డేటా ప్రత్యేక దృష్టి నిలిపింది.

ఉదాహరణకు, అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లా లాంటి మారుమూల ప్రాంతాలు సహా ఈశాన్య ప్రాంతంలోని కఠిన మైన మైదాన ప్రాంతాల్లో పేమెంట్ ఆప్షన్ గా PhonePe అంగీకరించబడుతోంది. 2020లో కేవలం 10000 మర్చంట్లకే పరిమితమైన అస్సాంలో 2022లో అత్యంత వేగంగా 2.5 లక్షల మందికి పైగా మర్చంట్లు PhonePeను స్వీకరించారు. త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాంలు కూడా అదే బాటను అనుసరించాయి. స్వాధీన రేటుతో పాటు, మొత్త లావాదేవీలు కూడా గణనీయంగా పెరిగాయి. 2018 మొదటి త్రైమాసికంలో 14.8 లక్షల లావాదేవీల నుండి ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి 7.5 కోట్లకు పైగా లావాదేవీలకు చేరాయంటే వృద్ధి ఎంత వేగంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

మర్చంట్ల డిజిటైజేషన్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తమైంది: మర్చంట్లకు అవగాహన కల్పించడం, పాలు పంచుకునేలా చేయడం, శక్తివంతులు చేయడం కోసం డిజిటల్ పేమెంట్ కంపెనీలు సాగిస్తున్న నిరంతర ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఉన్నమర్చంట్ నెట్ వర్క్ లు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేయడానికి దారి తీశాయి. UPIకు అతీతంగా ఇంటరాపరబుల్ QR కోడ్లు కూడా వీలు కల్పించింది. కస్టమర్ల నుంచి పేమెంట్లను అంగీకరించడానికి, సరఫరాదారులకు పే చేయడానికి కనీస నియంత్ర ణతో మర్చంట్లను అనుమతిస్తుంది. ఈ వృద్ధిపై సవాల్ చేస్తూ, 2022 మొదటి త్రైమా సికంలో 3 మిలియన్ మర్చంట్ల చేరికతో ఇప్పటివరకు సుమారు 30 మిలియన్ మర్చంట్లకు చేరుకుంది.

PhonePe Pulse డేటా భౌగోళికంగా సూచిస్తున్నది ఏమిటంటే, అండమాన్, నికోబార్ దీవులు, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే, P2M లావాదేవీల్లో అత్యధికంగా 29% పెరిగింది. అంతేకాక, 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2020తో పోల్చితే 2021లో రంగప్రవేశం చేసిన మర్చంట్ల సంఖ్య 100% పైగా పెరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం పెరుగుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. PhonePe Pulse డేటా ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ లోని మర్చంట్లు అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ
మర్చంట్లలో 49% మంది PhonePe నెట్ వర్క్ లో ఉన్నాయి.

ఫైవ్ బిలియన్ క్లబ్ లో డిజిటల్ లావాదేవీలు: కరోనా మహమ్మారి డిజిటల్ పేమెంట్ల స్వీకరణకు ఆటంకంగా మారగా, 2022 మొదటి త్రైమాసికంలో PhonePe Pulse డేటా గత రెండేళ్లలో నిలకడైన వేగానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 2022 మార్చిలో NPCI విడుదల చేసిన UPI నెంబర్లు మొత్త లావాదేవీ పరిమాణం 5.4 బిలియన్లకు చేరిందని
తెలుపుతుండగా, PhonePe Pulse డేటా P2P,P2M పరిణామాలు రెండింటిలోనూ పెరుగుదలను సూచిస్తోంది. డిజిటల్ పేమెంట్ల రంగానికి అతీతంగా మూడో, నాలుగో శ్రేణి పట్టణాలలో కొత్త వినియోగదారులను అందుకోవడంపై దృష్టి పెట్టినందున పేమెంట్ల వాతావరణం తర్వాతి 500 మిలియన్ వినియోగదారులను లక్ష్యంగా
చేసుకుంది కాబట్టి ఈ వృద్ధి వేగం ఇలాగే కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ఈ ధోరణుల గురించి PhonePe స్ట్రాటజీ అండ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగం హెడ్ కార్తీక్ రఘుపతి మాట్లాడుతూ, “మా గత ఏడాది నాలుగో త్రైమాసిక నివేదికలో ఊహించిన విధంగా, 2022 మొదటి త్రైమాసికంలో వివిధ రకాల వినియోగానికి మా యాప్ ఉపయోగించడం పెరగడం వల్ల కాంటాక్ట్ లెస్ పేమెంట్ల దిశగా వినియోగదారు ప్రవర్తన మారుతుండడం మరింత బలపడింది. డిజిటల్ పేమెంట్లు నిజంగా మర్చంట్ ఎకోసిస్టంను చొచ్చుకు వెళ్లి, దేశవ్యాప్తంగా విస్తృతంగా అంగీకారం పొందుతుండడాన్ని సూచించేలా, PhonePe , P2M లావాదేవీలు P2P లావాదేవీలను మించడం మాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇది అంతర్గతంగా మర్చంట్ అంగీకారం, వినియోగదారు డిమాండ్ పెరిగిన విషయాన్ని సూచిస్తుంది. PhonePe Pulse డేటా ఈ వాతావరణంలో లోతైన నాలెడ్జ్ భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుంది.

ఈ డేటా భవిష్యత్తులో ఎలాంటి కొత్త ఆవిష్కరణలను తీసుకురానున్నాయనే విషయాన్ని చూడాలనుకుంటున్నాము.” అని అన్నారు.2021 సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించిన PhonePe Pulse దేశంలోని డిజిటల్ పేమెంట్లపై డేటా, పరిశీలనలు, ధోరణులతో భారతదేశంలోని మొట్టమొదటి ఇంటరాక్టివ్ వెబ్ సైట్ గా నిలుస్తోంది. PhonePe Pulse వెబ్ సైట్ అనేది భారతదేశంలో ఇంటరాక్టివ్ మ్యాప్ పై వినియోగ దారులు చేసిన 4000 కోట్లకు పైగా లావాదేవీల దృశ్య సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
పరిశ్రమ అగ్రగామిగా PhonePe యొక్క డేటా దేశంలోని డిజిటల్ పేమెంట్ల అలవాట్లకు ప్రతిబింబంగా నిలుస్తోంది.