Fri. Apr 19th, 2024
DG NIRDPR inaugurated the orientation training
  Panchayats across the country to prepare Citizen Charter by 15th August 2021
Panchayats across the country to prepare Citizen Charter by 15th August 2021

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 30,2021:సిటిజన్‌ చార్టర్‌ విధానాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ సిద్ధమైంది. అందులోభాగంగా రేపటి నుంచి నుంచి ఆగస్టు 15 వరకూస్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15 కల్లా ప్రతి పంచాయతీలో సిటిజన్‌ చార్టర్‌ తయారుచేయాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీ అధికారులకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)ఆన్‌లైన్‌లో ఓరియంటేషన్‌ కార్యక్రమాన్నినిర్వహించింది.

DG NIRDPR inaugurated the orientation training
DG NIRDPR inaugurated the orientation training

జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే ఓరియెంటేషన్‌ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీ రూపొందించిన ఫెసిలిటేటర్స్‌ ట్రైనింగ్‌ మాడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్‌ ప్రేమ్‌నగర్‌, ఎన్‌ఐఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల రాధిక రస్తోగి, ఎన్‌ఐఆర్‌డీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కతిరిసేన్‌ తదితరులు పాల్గొన్నారు.