Thu. Apr 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 30,2022:దేశంలో నైపుణ్యాలు,డిజిటల్ విద్య కోసం భారత ప్రభుత్వం మద్దతులో భారతదేశంలో నైపుణ్యాల సమూహాన్ని విస్త్రతం చేయడానికి అంతర్జాతీయ ప్రతిభని అభివృద్ధి చేసే సంస్థ ఎన్ఐఐటీ లిమిటెడ్, చొరవల్ని ఈరోజు ప్రకటించింది. దేశంలో టెక్ నైపుణ్య సమూహాన్ని విస్త్రతం చేసే ప్రధానమైన చొరవలో భాగంగా, డిప్లొమా కలిగిన వారు
కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటి, క్లౌడ్ (ఈ ప్రోగ్రాంస్ ఇంతకు ముందు కేవలం
ఇంజనీరింగ్ విద్యార్థులు కోసం మాత్రమే పరిమితం చేయబడ్డాయి) లలో ఎన్ఐఐటీ వారి ప్రోగ్రాంస్ కి అర్హులు.

రెడ్-హ్యాట్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ (ఈఎక్స్ – 200),CompTIA N+సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (ఈసీ-కౌన్సిల్) వంటి పరిశ్రమలో ప్రముఖమైన సర్టిఫికేషన్స్ కోసం అభ్యాసకుల్ని రూపొందించడానికి సైబర్ సెక్యూరిటీ పై ప్రోగ్రాం రూపొందించ బడింది. రెడ్-హ్యాట్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ (ఈఎక్స్ -200), CompTIA N+ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ SysOps అడ్మినిస్ట్రేటర్ -అసోసియేట్ (ఎస్ఓఏ- సీ02) సర్టిఫికేషన్ కోసం అభ్యాసకుల్ని క్లౌడ్ కంప్యూటింగ్ కి తయారు చేస్తాయి. అభ్యాసకుల అవసరాలకు అనుకూలంగా తమ ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ ప్రోగ్రాంని ఇప్పుడు పార్ట్ టైమ్ లో కూడా పొందవచ్చని ఎన్ఐఐటీ ప్రకటించింది.

ఈ ఆన్ లైన్ ప్రోగ్రాంస్ లైవ్,ఇంట రాక్టివ్ విధానంలో అందించబడతాయి, టెక్
పరిశ్రమ, కొత్త డిప్లొమాగోల్డర్స్ ఉద్యోగం సంసిద్ధత, ఇంజనీరింగ్,సైన్స్ గ్రాడ్యుయేట్స్ ,ఇప్పటికే ఉన్న సిబ్బంది మధ్య అంతరాన్ని పూడ్చటంలో సహాపయపడతాయి.
ఎన్ఐఐటీ నుండి లభించే ఇతర ప్రోగ్రాంస్ లో డిజిటల్ మార్కెటింగ్, ప్రోడక్ట్
ఇంజనీరింగ్, డేటా సైన్స్ &మెషీన్ లెర్నింగ్, 5 జీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్,గేమ్ డవలప్ మెంట్ వంటి ఆధునిక విభాగాలు కూడా భాగంగా ఉన్నాయి.ఎన్ఐఐటీ డిజిటల్ ద్వారా విలక్షణమైన బోధనా పరిష్కారాల్ని అభివృద్ధి చేసి, అందచేయడం ద్వారా అభ్యసించడానికి మరింత డిజిటల్ పరంగా సమీకృత భారతదేశాన్ని రూపకల్పన చేసే భారత ప్రభుత్వం లక్ష్యానికి ఎన్ఐఐటీ స్థిరంగా తోడ్పడుతోంది.

దీనిలో భాగంగా, వివిధ పరిశ్రమలకు చెందిన సబ్జెక్ట్ అంశాల నిపుణులతో వారానికి ఒకసారి ఉచిత వెబినార్ నిర్వహిస్తోంది, దీనిలో అభ్యాసకులు లైవ్ ప్రశ్నలు అడగవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ ప్రారంభించడం గురించి మాట్లాడుతూ, అభిషేక్ అరోరా, ఈవీపీ, బిజినెస్ హెడ్, స్కిల్స్,కెరీర్ బిజినెస్, ఎన్ఐఐటీ ఇలా అన్నారు,”ఎన్ఐఐటీ లో,అంతరాయం, అభ్యాసన,మార్పు అనేవి గుర్తింపు పదాలుగా ఉన్నాయి.అభ్యాసకు లు,ప్రొఫెషనల్స్ కోసం గ్యారంటీ ఉపాధి కల్పనలతో ఆధునిక కాలం ఆన్ లైన్ అభథ్యాసన కోసం ఒక మార్గంగా మేము ఎన్ఐఐటీ డిజిటల్ వ్యవస్థని ప్రారంభించా ము. ఎన్ఐఐటీ అందించే కొత్త ఆన్ లైన్ ప్రోగ్రాంస్ పరిశ్రమ నిర్దేశిత,ప్రత్యక్షంగా శిక్షణ, గ్యారంటీ ఉద్యోగాల్ని కూడా అభ్యాసకులకు అందించేలా రూపొందించబడ్డా యి. మేము ప్రకటించిన కొత్త చొరవలతో పాటు మా ఆధునిక టెక్నాలజీ ప్రోగ్రాంస్ డిజిటల్ గా మారుతున్న భారతదేశం,గాథలో ఒక ముఖ్యమైన బాధ్యతవహిస్తాయి.”

తమ ఆన్ లైన్ ప్రోగ్రాంస్,వెబినార్స్ తో భారతదేశంలో డిజిటల్ చదువులో ఒక
ప్రముఖ శక్తిగా నిచిలిన ఎన్ఐఐటీ ప్లేస్మెంట్ రేట్స్ లో కూడా శ్రేష్టతని చూపించింది.
మార్చి 30, 2022 నాటికి, ఎన్ఐఐటీ తమ ఆధునిక టెక్నాలజీ ప్రోగ్రాంస్ కోసం 100%
ప్లేస్మెంట్స్ ని నమోదు చేసింది. తమ అభ్యాసకుల జీవితాలలో మార్పుని కలిగించే కీలకమైన ఉద్యోగాలు పొందడంలో సహాయపడటంలో సంస్థ,విజయానికి శిక్షణలో కంపెనీ,40 సంవత్సరాల వారసత్వం,800కి పైగా నియామకపు భాగస్వాములతో కంపెనీ,సంబంధాలు సహాయపడ్డాయి. ఎన్ఐఐటీ,దాని # అబ్ ప్లేస్మెంట్ పక్కీ కాంపైన్ పై మరింత సమాచారం కోసం,దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్ఐఐటీ నుండి ప్రోగ్రాంస్ సరళమైన చెల్లింపు ఎంపికలు, ఫీజు చెల్లింపు కోసం నో కాస్ట్ఈ ఎంఐలు, ప్రోగ్రాంస్, కెరీర్ అవకాశాలు,ఎంపిక పై మార్గదర్శకత్వం,సందేహాలు తీర్చడానికి ఎన్ఐఐటీలో మార్గదర్శకులతో పరస్పరం చర్చలు వంటి ఎన్నో
ప్రయోజనాల్ని కలిగి ఉన్నాయి.ఇంకా, కంపెనీ అభ్యాసకులు కోసం ‘ట్రై బిఫోర్ యు బై’ఆప్షన్ కేటాయించి, మరింత అవగాహనతో కూడిన ప్రొఫెషనల్ గా అభివృద్ధికర మైన నిర్ణయాలు కోసం ప్రోగ్రాం వారికి ఏ విధంగా పని చేస్తుంది విషయం పై వారు అనుభవం పొందడానికి అనుమతి ఇస్తుంది.

ప్రోగ్రాం పూర్తి చేసిన తరువాత అభ్యాసకులకు గ్యారంటీ ఉద్యోగం లభించకపోతే, నియమాలు, షరతులకు లోబడి, ఎన్ఐఐటీ పూర్తి ప్రోగ్రాం ఫీజుని కూడా వాపసు
చేస్తుంది. అదనంగా, అభ్యాసకులు ఆన్ లైన్ లో అభ్యసించే వ్యవస్థని ఉపయోగించ డానికి మెరుగ్గా సిద్ధమయ్యారు, దేశంలో 1వ రోజు నుండే నైపుణ్యమున్న సమూహానికి
ఉద్యోగం సిద్ధంగా ఉండేలా తోడ్పడతారు.