Sat. Apr 27th, 2024
woman exercise

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్12,2022: పురుషులు, మహిళలు వేర్వేరు సమయాల్లో వ్యాయామం చేయాలని ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. వ్యాయామం ప్రభావంసెక్స్ పై ఆధారపడి ఉంటుందని ఈ సర్వేలో తేలింది. ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీలో ఈ సర్వే ఫలితాలను ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని, కానీ అందుకు ఉదయం కంటే పురుషులకు సరైన సమయం సాయంత్రం అని తేలింది.

woman exercise

ఏ సమయంలో వ్యాయామం చేసినా ఆడవారికి వారి మొత్తం శరీర కొవ్వు, పొత్తికడుపు, తుంటి కొవ్వు రక్తపోటును తగ్గించడంలో సహాయ పడినట్లు ఉదయం వ్యాయామం చేసే మహిళల్లో ఈ మెరుగైన ఫలితాలు కనిపించినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి విరుద్ధంగా, పురుషులలో సాయంత్రం-వ్యాయామం చేయడం వల్ల హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటు, శ్వాసకోశ మార్పిడి నిష్పత్తి , కార్బోహైడ్రేట్ ఆక్సీకరణ మొత్తం నిష్పత్తిలో తగ్గుదల కని పించింది.ఎందుకంటే కొవ్వు ప్రాధాన్యత ఇంధన వనరుగా మారిందని అధ్యయనం వెల్లడించింది.

man-exercise

“మహిళలకు ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల పొట్ట కొవ్వు ,రక్తపోటు తగ్గుతుందని, అయితే సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాల బలం, శక్తి , ఓర్పు పెరుగుతుంది. మానసిక స్థితి ,పోషక సంతృప్తిని మెరుగుపరుస్తుంది” అని న్యూయార్క్‌లోని స్కిడ్‌మోర్ కాలేజ్‌లోని హెల్త్ అండ్ హ్యూమన్ ఫిజియోలాజికల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ పాల్ జేఆర్సిరో అని చెప్పారు. ఉదయం వ్యాయామంతో పోలిస్తే పురుషులకు సాయంత్రం వ్యాయామం రక్తపోటు, గుండె జబ్బులు, అలసటను తగ్గిస్తుంది. అంతేకాదు ఒంట్లో కొవ్వు కూడా కరుగుతుందని ఆయన చెప్పారు.అధ్యయనంలో 30 మంది మహిళలు 26 మంది పురుషులు పాల్గొన్నారు. వీరంతా 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లే. వీళ్ళు ఆరోగ్యవంతులు, ధూమపానం అలవాటులేనివారు. సాధారణ బరువు కలిగినవారు, వీరు రోజులోని వేర్వేరు సమయాల్లో12 వారాల పాటు శిక్షణ పొందారు. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామానికి కేటాయించిన దానితో సంబంధం లేకుండా, ట్రయల్ సమయంలో పాల్గొనే వారందరూ మొత్తం ఆరోగ్యపనితీరులో మెరుగుపడ్డారని పరిశోధనలో తేలింది.

woman exercise

“గుండె, జీవక్రియ మూడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉదయం, సాయంత్రం వ్యాయామ ప్రయోజనాల ద్వారా స్త్రీలు , పురుషులలో మెరుగైన ఫలితాలు ఈ అధ్యయనంలో స్పష్టంగా కనిపించాయని ఆర్సిరో చెప్పారు. ముఖ్యంగా, శారీరక పనితీరు, కార్డియోమెటబోలిక్ ఆరోగ్యం, మానసిక స్థితి రోజు వ్యాయామ సమయం నిర్ణయిస్తుందని వెల్లడైంది.”మా పరిశోధనల ఆధారంగా, పొత్తికడుపు కొవ్వు, రక్తపోటును తగ్గించడంలో ఆసక్తి ఉన్న మహిళలు, కాలి కండరాల శక్తిని పెంచడానికి ఉదయం వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే, శరీర కండరాల దృఢత్వం, శక్తి , ఓర్పును పొందేందుకు ఆసక్తి ఉన్న మహిళలు, మానసిక స్థితిని మెరుగుపరచడం, ఆహారం తీసుకోవడం సాయంత్రం వ్యాయామం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని ఆర్సిరో చెప్పారు. గుండె ఆరోగ్యం, జీవక్రియను మెరుగు పరుచుకోవాలనుకునే పురుషులకు సాయంత్రం వ్యాయామం అనువైనదని ఈ సర్వేలో వెల్లడైంది.