New Fund Offer (NFO): IDFC Floating Rate FundNew Fund Offer (NFO): IDFC Floating Rate Fund

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,  ఫిబ్రవరి 08,2021:ఐడీఎఫ్‌సీ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ)ను బుధవారం, ఫిబ్రవరి 10,2021వ తేదీ తెరువడంతో పాటుగా మంగళవారం, ఫిబ్రవరి 16,2021వ తేదీన మూసివేస్తారు. ఫ్లోటింగ్‌ రేట్‌ డెబ్ట్‌, ఫ్లోటింగ్‌ రేట్‌ రిటర్న్స్,మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌  కోసం స్వాప్‌ చేయబడిన ఫిక్స్‌డ్‌ రేట్‌ డెబ్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో ద్వారా ఈ ఫండ్‌ స్థిరమైన రాబడులను సృష్టించనుంది. ఈ ఫండ్‌ కనీసం 65% తమ కార్పస్‌ను కార్పోరేట్లు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫ్లోటింగ్‌ రేట్‌ సెక్యూరిటీలు లేదా  స్థిరమైన వడ్డీ అందించే సెక్యూరిటీలను  డెరివేటివ్స్‌ ద్వారా ఫ్లోటింగ్‌గా మార్చడం లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి పెట్టనుంది. ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ ఫండ్‌ను ఆవిష్కరించడం గురించి విశాల్‌ కపూర్‌, సీఈవో– ఐడీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఎంసీ) మాట్లాడుతూ ‘‘ ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో  ప్రకటించిన వృద్ధి లక్ష్యాలతో పాటుగా బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్లుపై ఒత్తిడి వంటి అంశాలు స్థిరీకరించబడుతున్నాయి. కార్పోరేట్‌ పన్నుల కోత కారణంగా తయారీ పరిశ్రమకు మరింత శక్తి లభించడంతో పాటుగా అంతర్జాతీయంగా వాణిజ్యం కూడా వృద్ధి చెందనుంది. ప్రభుత్వ ఆదాయం కూడా మెర్గుగ్గా ఉండబోతుంది. మా దృష్టిలో ఈ తరహా చక్రీయ కారకాలు, నిధుల పెట్టుబడుల వ్యూహానికి సంభావ్య తోడ్పాటునందిస్తాయని భావిస్తున్నాం’’ అని అన్నారు.

New Fund Offer (NFO): IDFC Floating Rate Fund
New Fund Offer (NFO): IDFC Floating Rate Fund

ఈ ఫండ్‌ ప్రస్తుతం తక్కువ నుంచి స్వల్పకాలపు పోర్ట్‌ఫోలియోను లక్ష్యంగా చేసుకుంది. కనీసం ఆరు నెలల సిఫార్సు చేయబడిన పెట్టుబడికి ఇది అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి సమయంలో  పోర్ట్‌ఫోలియో వ్యూహం ఏఏఏ/ఏ1+ఈక్వివాలెంట్‌/సావరిన్‌/క్వాసీ సావరిన్‌ సెక్యూరిటీలులో కనీసం  70%  నిర్వహించనుంది,ఈ ఫండ్‌ ఏఏ– కన్నా తక్కువ రేటింగ్‌ కలిగిన సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టదు. ఐడీఎఫ్‌సీ  3 లెన్స్‌ డెబ్ట్‌ కేటాయింపుల విధానం , ఇన్వెస్టర్ల డెబ్ట్‌ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను గుర్తించి, నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ డెబ్ట్‌ ఫండ్స్‌ను  మూడు రకాలు:లిక్విడిటీ, కోర్‌, శాటిలైట్‌ అంటూ వేరు చేస్తుంది. నిర్ణయాధికారాలలో ఇవి సహాయపడతాయి.ఈ ఫండ్‌కు మేనేజర్లుగా  సీనియర్‌ ఫండ్‌ మేనేజర్అ నురాగ్‌ మిట్టల్,ఫండ్‌ మేనేజర్‌,హెడ్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రీసెర్చ్ అరవింద్‌ సుబ్రమణియణ్‌లు వ్యవహరించనున్నారు.ఈ పథకాన్ని నిఫ్టీ లో డ్యూరేషన్‌ డెబ్ట్‌ ఇండెక్స్‌కు బెంచ్‌మార్క్‌ చేశారు.