శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

AP News covid-19 news Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబర్ 12,2021:తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన,మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 13 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది.