Fri. Mar 29th, 2024
Trivikram-Srinivas

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 26, 2022: ‘నువ్వే నువ్వే’ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా ‘నువ్వే నువ్వే’ నిలిచింది. వెండి నందిని ‘స్రవంతి’ రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు.

introduced Trivikram Srinivas as a director

ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నంది అవార్డు తెచ్చిన డైలాగులు ఓసారి చూద్దాం..

‘నువ్వే నువ్వే’ సినిమాలో డైలాగులకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగులు :

  • కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.
  • ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.
  • సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
  • డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు.
  • ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు… పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.
  • మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు.
  • ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని… వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు.
  • ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు… ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?
  • నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?
  • అమ్మ, ఆవకాయ్, అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు.
  • డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు.
  • తాజ్ మహల్… చార్మినార్… నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు.
  • నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.
Trivikram-Srinivas