Fri. Mar 29th, 2024
ARTS-COLLEGE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూలై 12,2022: తిరుప‌తి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న ఏర్పాట్లను జెఈవో మంగళవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

JEO-(H-&-E)-INSPECTS-ARTS-C

కళాశాల లోని అన్ని ల్యాబ్ లు తరగతి గదులు మైదానం పరిశీలించా రు .న్యాక్ కమిటీకి వివరించే అంశాల గురించి అధ్యాపకులు,విద్యార్థు లతో చర్చించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.కళాశాల కు సంబంధించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు .

INSPECTS-ARTS-COLLEGE

ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, క‌ళాశాల‌లో జ‌రుగుతున్న మౌళిక వ‌స‌తుల‌ అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేశారన్నారు.నాక్ కమిటీ సభ్యులకు ఆయా విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విభాగానికి సంబంధించిన అంశాలు వివరిస్తారని తెలిపారు.

JEO-(H-&-E)-INSPECTS-ARTS

అదేవిధంగా కళాశాలలోని హిస్టరీ విభాగం అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు.ఇప్ప‌టికే క‌ళాశాల‌కు ఏ గ్రేడ్ గుర్తింపు ఉంద‌ని, నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని తెలిపారు .

ARTS-COLLEGE

డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయ‌ణ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.