మిస్టరీ థ్రిల్లర్ దృశ్యం -2 విడుదల డేట్ ను ప్రకటించిన ప్రైమ్ వీడియో..

Business Cinema Entertainment Featured Posts international news National Technology Trending
Spread the News

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై, 13 నవంబర్,2021: ప్రైమ్ వీడియో ఈరోజున వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ చిత్రం దృశ్యం 2 గ్లోబల్ ప్రీమియర్ను ఇండియా, ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, టెర్రిటరీలలో 25 నవంబర్ 2021కి ప్రకటించింది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ మరియు మాక్స్ మూవీస్ నుంచి నిర్మాతలు డి.సురేష్ బాబు, రాజ్కుమార్ సేతుపతి, ఆంటోని పెరుంబవూరు ద్వారా నిర్మించబడిన ఈ చిత్రం అత్యంత ఆదరణ పొందిన తెలుగు సూపర్హిట్ చిత్రం దృశ్యం కు సీక్వెల్. ఈ చిత్రం లో వెంకటేష్ దగ్గుబాటితో పాటు మీనా, కృతిక, ఎస్తేర్ అనిల్, సంపత్ రాజ్ ,పూర్ణ వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు.

దృశ్యం చిత్రం వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఈ చిత్రం లో మారిన రాంబాబు జీవితంలోని మార్పులను నిశితంగా చూపిస్తుంది. అతని కుటుంబ శ్రేయస్సుకు ఇబ్బందికరంగా మారిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పరిస్థితులు మారటంతో, మోసం, అబద్ధాలు,మిస్టరీ కలిసిన ఈ రసవత్తరమైన స్టోరీ లో రాంబాబు మీద తన సర్వశక్తులను చూపి, తన సన్నిహితులను కాపాడుకోవాల్సిన బాధ్యత పడుతుంది. ఈ రివటింగ్ క్రైమ్-డ్రామా లో వచ్చే ప్రతి ఒక్క ట్విస్ట్ మిమ్మల్ని మీ సీట్ అంచున కూర్చోబెట్టి, ఆసక్తితో మిమ్మల్ని కట్టి పడేయటానికి సిద్ధంగా ఉంది.ఈ చిత్రం తెలుగులో నవంబర్ 25న ప్రైమ్ వీడియోలో ఇండియాలో,240 దేశాలు,టెర్రిటరీలలో విడుదల కాబోతున్నది.

దృశ్యం 2 టీజర్ ను ఇక్కడ చూడండి: