Fri. Apr 19th, 2024
mothers-day special story

మాతృదినోత్సవం సందర్భంగా..365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ప్రత్యేక కథనం…

mothers-day special story

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,మే 8,2022: ఈ సృష్టే ఎంతో అపురూపమైనది…అందులో అత్యంత అపురూపమైనది స్త్రీ మూర్తి … ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం నుంచి కలిగే ఆనందం అనంతం… మాటల్లో చెప్పలేనిది. అది అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం ఆనందంగా భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమ మరొకటి లేదని అనాదిగా నిరూపిస్తున్నా…అద్దె గర్భాలతో నెట్టుకొస్తున్నారు కొందరు.ఎన్నో ప్రయాసలకోర్చి తమబిడ్డలను కాపాడుకుంటూ అన్నివేళల్లో వారి అభ్యున్నతి కోరుకుంటున్న మాతృప్రేమకు అందరం శిరస్సు వంచి పాదాభి వందనం చేయాల్సిందే..అయినా మనకోసం ఇంత చేస్తున్న అమ్మను పట్టించుకోని ఈరోజుల్లో… మనకోసం ఇంత చేస్తున్న తల్లి ప్రేమకు వెలకట్టగలమా..? ఎవరికివారే ఆలోచించుకోవాలి…

mothers-day special story

ఈ జగతిలో అమ్మ లేని జీవి ఏదీవుండదు….తల్లి మొదటి గురువు…మొదటి స్నేహితురాలు….ఏ పాత్ర నైనా తొలి సారి పరిచయం చేసేది అమ్మే… పుట్టి ఈ లోకం లోనికి అడుగు పెట్టగానే తల్లి మాటే మొదట వినబడేది…తల్లి లాలనలేని జీవితం చీకటిమయం…తల్లి గర్భం లో ఉండగానే పిల్లలు ఎన్నో విషయాలను వింటూ… తెల్సుకుంటూ… పుట్టకముందే నేర్చుకుంటారు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధన లో వెల్లడైంది.

https://telugu.boldsky.com/insync/pulse/happy-mothers-day-wishes-quotes-greetings-thoughts-images-whatsapp-status-messages-in-telugu/articlecontent-pf141879-023472.html

అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసు కుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందట. పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకు న్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్య మిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ప్రదర్శిస్తుంది.

mothers-day special story

మహా సామ్రాజ్యానికి రాజైనా…. ఓ తల్లికి మాత్రం కొడుకే… అంటే స్థాయి ని బట్టి తల్లి స్థానం మారదు…. ఆ మాత్రు మూర్తి పంచే ప్రేమా మారదు… ప్రపంచం లో కల్తీలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే…. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ఎన్నో దేశాలు జరుపుకొంటున్నాయి. అమెరికాలో ఆ రోజున అందరూ తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉత్సవాలు జరుపుకొంటారు. అమ్మ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. ఇంటింటా పండగ వాతావరణం నిండిపోతుంది.ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూడా మాతృదినోత్సవం ఘనంగా జరుపుతారు.కెనడా దేశంలో మాతృదినోత్సవం రోజు గులాబీరంగు దుస్తులు ధరిస్తారు. తల్లికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తారు. ప్రేమకు మారుపేరు అమ్మ. అమ్మ అందమైన అనుబంధం. అంతేలేని అనురాగం. మరపురాని మధుర జ్ఞాపకం.