Thu. Apr 25th, 2024
websites

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ,అక్టోబర్ 27,2022: ఇండియాలో అత్యధిక ఆదరణ కలిగిన వెబ్‌సైట్స్ జాబితాలో డబుల్ క్లిక్ డాట్ నెట్ అనే వెబ్ సైట్ 20వ స్థానంలో ఉంది. 19వస్థానంలో క్వార డాట్ కామ్ ఉండగా గూగులీపిస్ 18వస్థానంలో,వాట్సాప్ డాట్ కామ్ 17వస్థానంలో ఉంది.

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సైట్‌లు కూడా ఉన్నాయి. ఆయా సైట్స్ ఒక్కోకటి ఒక్కో రకమైన కంటెంట్ ను ప్రొవైడ్ చేస్తున్నాయి. పోర్టల్స్ అందించే సమాచారం, వినియోగదారుల ట్రెండ్‌లను గుర్తించడానికి, గమనించడానికి ,ప్రపంచంలోని ప్రముఖ వెబ్‌సైట్‌లు – వాటి ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. ప్రతి నెలలో మార్పులు సంభవిస్తుంటాయి.

websites

https://www.semrush.com/website/top/india/all/

google.com సెప్టెంబర్ 2022లో భారతదేశంలో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ గా అన్ని వెబ్ సైట్లకంటే ముందంజలో నిలిచి నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. గూగుల్ డాట్ కామ్ దాదాపు 5.2B నెలవారీ సందర్శనలను ఆకర్షిస్తోంది. youtube.com 3.6B సందర్శనలతో రెండవ స్థానంలో ఉంది. elephantbet.co.ao కూడా దాదాపు 618.5M సందర్శనలతో మూడో స్థానంలో ఉంది.

పేజీల సందర్శన,ఒక వ్యక్తి వెబ్‌సైట్‌లో ఒక సెషన్‌లో ఎన్ని పేజీలను సగటున సందర్శిస్తారో అంచనా విషయంలో ఈ ప్రసిద్ధ వెబ్‌సైట్‌ల సందర్శనకు మొత్తం సగటు పేజీలు 3.48 పేజీలు ఉండగా… సందర్శనకు అత్యధిక సగటు పేజీలు – readmanganato.com – 7.37 పేజీలు ఉన్నాయి.

బౌన్స్ రేట్: వెబ్‌సైట్ సగటు బౌన్స్ రేట్ అంచనా లేదా కేవలం ఒక పేజీని చూసిన తర్వాత వెబ్‌సైట్ నుంచి నిష్క్రమించే సందర్శకుల శాతం. మొత్తం సగటు బౌన్స్ రేటు 48.41% ఉండగా, అత్యధిక బౌన్స్ రేటు – idnes.cz – 80.4% గా ఉంది.