వెడ్డింగ్ సీజన్‌లో “మీషో’పై షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్న వినియోగదారులు..

Business Featured Posts Festivals news Life Style National tech news Technology Top Stories Trending TS News
Spread the News

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 25, 2022: వినియోగదారులు నేడు ఆన్ లైన్ లో షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ అవసరాలను తీర్చుకోవడానికి అత్యంత సురక్షితమైన మార్గంగా భావిస్తూ ఈ-కామర్స్‌ ప్లాట్ ఫామ్స్ నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వివాహ షాపింగ్‌ ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైన అనుభవా లను అందిస్తుంది. అది మీరు వధువు అయినా, ఆమెకు దగ్గరి బంధువు లేదా అతిథి అయినా ఆ అనుభవాలలో మార్పేమీ ఉండదు. భారతదేశంలో సంప్రదాయాలు ప్రాంతాలను బట్టి విభిన్నంగా ఉండవచ్చు కానీ వివాహ వేడుకల వేళ వెడ్డింగ్‌ ఔట్‌ఫిట్‌ సంస్కృతి మాత్రం ఒకేలా ఉంటుంది.

ఇటీవలి కాలంలో, వివాహ షాపింగ్‌ అనేది ఎక్కువగా ఈ–కామర్స్‌ ఆధారితంగా ఉంటుంది. దీనికి విస్తృత స్థాయిలోఅవకాశాలు లభించడంతో పాటుగా తమ ఇంటి వద్ద నుంచే సౌకర్యవంతంగా షాపింగ్‌ చేసే అవకాశం లభించడం మరో
కారణం. ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ఎక్కువ మంది అభిమానించడానికి 24 గంటలూ అది అందుబాటులో ఉండటంతోపాటుగా అత్యుత్తమ ఆఫర్లు, ధరలలో లభించడం మరో కారణం.భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్‌ యాప్‌ మీషో, ఇటీవలి కాలంలో స్త్రీ, పురుషులఎథ్నిక్‌ వేర్‌ అయినటువంటి లెహంగా చోలీ, కుర్తా సెట్స్‌, ఎథ్నిక్‌ గౌన్లు, షెర్వానీలు, ఎథ్నిక్‌ జాకెట్లును సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్య కాలంలో కొనుగోలు చేశారు. ఈ కాలంలో కిడ్స్‌ ఎథ్నిక్‌ అప్పెరల్‌కు సైతం వృద్ధి
కనిపించింది. మరీ ముఖ్యంగా లెహంగా చోలీలు, కుర్తా సెట్స్‌, ఎథ్నక్‌ సెట్స్‌ వంటివి 2021లో అత్యధికంగా అమ్ముడయ్యాయి.

వివాహ సీజన్‌లో చీరల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. జూలై 2020 నుంచి చీరల ఆర్డర్లు పెరిగాయి. వివాహ సీజన్‌ ఆరంభం తరువాత వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న ధోరణి గత రెండేళ్లగా కనిపిస్తుంది. అక్టోబర్‌ నుంచి రల విక్రయాలలో మూడు రెట్ల వృద్ధి నమోదయింది.ఈ అత్యద్భుతమైన డ్రేప్స్‌ను కాంప్లిమెంట్‌ చేస్తూ మీషోపై ఎథ్నిక్‌ జ్యువెలరీని కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు.

అత్యధికంగా విక్రయించిన వస్తువులలో జ్యువెలరీ సెట్స్‌, మంగళ సూత్రాలు, నెక్లెస్‌లు, చైన్స్‌ ఉన్నాయి. ఆసక్తికరంగా, 2021లో టియర్‌ 4 నగరాల నుంచి ఎథ్నిక్‌ ఆభరణాలకు అధిక ఆర్డర్లను చూశాము. మహిళల ఆభరణాలకు సంబంధించి అత్యధిక సంఖ్యలో ఆర్డర్లను అందించిన టాప్‌ 3 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. అలాగే కిడ్స్‌ ఎథ్నిక్‌ అప్పెరల్‌, బ్రైడల్‌ వేర్‌లో కూడా ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో ఆర్డర్లు లభించాయి.