Mon. Dec 5th, 2022
mohan-babu-_krishna
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 15,2022: ఈరోజు ఉదయం ఆసుపత్రిలో కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు, నటులు, నటీమణులు, రాజకీయ నాయకులు ఆయన ఇంటికి చేరుకున్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్ లు దివంగత కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించారు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కృష్ణకు నివాళులు అర్పించారు, అయితే ఈసందర్భంగా భౌతికకాయాన్ని చూసిన ఆయన ఒకసారిగా కుప్పకూలిపోయారు.

mohan-babu-_krishna

అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ..తన కెరీర్ ఎదగడానికి కృష్ణ సహకరించారన్నారు. కృష్ణతో కలిసి 70కి పైగా సినిమాల్లో నటించానని, ఆ తర్వాతి చిత్రాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశానని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదితరులు కూడా సూపర్ స్టార్ కు నివాళుల ర్పించారు.