365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 29,2023:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)ప్రతినెలా 1వ తేదీన జరిగే మార్పుల్లో ఈసారి అత్యంత ముఖ్యమైన మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజలను నేరుగా ప్రభావితం చేయనున్నాయి.
అన్ని టెలికాం ఆపరేటర్లను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి మే 1తేదీ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. టెలికాం ఆపరేటర్ ద్వారా అమలు చేసిన కొత్త స్పామ్ ఫిల్టర్ ప్రజలను మోసపూరిత కాల్‌లు, సందేశాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

మే1వతేదీ నుంచి ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు స్వస్తి పలకనుంది. ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అందులో భాగంగా మొబైల్ వినియోగంపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
10 అంకెల మొబైల్ నంబర్ ఇక నుంచి ఉండదు. ప్రస్తుతం ఉపయోగించే 10 అంకెల మొబైల్ నంబర్ ఇకపై ఉపయోగంలో ఉండదు. దీని కోసం TRAI మార్గదర్శకాల ప్రకారం 12అంకెల మొబైల్ నంబర్‌ను టెలికాం ఆపరేటర్లకు జారీ చేయనున్నారు.