Fri. Apr 19th, 2024
Metroride_app365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 8,2023: మెట్రోరైడ్, మెట్రో ప్రయాణికుల కోసం భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో నడిచే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ హైదరాబాద్‌లో తన సేవలను విస్తరించినట్లు ప్రకటించింది.

ఉప్పల్ హబ్సిగూడ మెట్రో స్టేషన్లలో తన సేవలను పొడిగిస్తున్నట్లు మెట్రోరైడ్ ప్రకటించింది. రోజువారీ మెట్రో ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌లలో పూర్తిస్థాయిలో సేవలు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించనున్నారు.

యాప్ ఆధారిత సేవలు రోజువారీ ప్రయాణీకులకు త్రీ వీలర్, టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల్లో షేర్డ్ , ప్రైవేట్ రైడ్‌లను అందిస్తుంది, ఇది ఉప్పల్, హబ్సిగూడ మెట్రో స్టేషన్‌ల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది.

Metroride_app365

ప్రయాణికులకు 5 నిమిషాల పికప్ సమయాన్ని అందిస్తాయి. రైడ్‌లు ఎటువంటి పెరుగుదల ధర, సున్నా డ్రైవర్ రద్దులతో సరసమైనవి. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు మెట్రోరైడ్ ఇండియా యాప్‌లో రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు, ఇది Google Play Storeఅండ్ Apple యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా మెట్రోరైడ్ సీఈఓ అండ్ కో-ఫౌండర్ గిరీష్ నాగ్‌పాల్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మా పరిధిని విస్తరించడం సంతోషంగా ఉంది. మేము ఏప్రిల్ 2022లో నగరంలో ప్రారంభించినప్పటి నుంచి, ఉప్పల్, హబ్సిగూడ మెట్రో స్టేషన్‌లకు సేవలను విస్తరించమని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రయాణికుల నుంచి మాకు అభ్యర్థనలు వచ్చాయి.

” త్వరలో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లకు మా సేవలను విస్తరించేందుకు మేము కృషి చేస్తున్నాము” అని ఆయన వెల్లడించారు.

Metroride_app365

మెట్రోరైడ్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు, కామన్ అగర్వాల్ “మాకు హైదరాబాద్ మెట్రో ,తెలంగాణ ప్రభుత్వం నుంచి గొప్ప మద్దతు లభించింది, అందుకే మా నెట్‌వర్క్‌ను కొన్ని నెలల వ్యవధిలో విస్తరించడం సాధ్యమైంది.

ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం, మేము లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నాము “అని ఆయన తెలిపారు.