Fri. Mar 29th, 2024
Megastar Chiranjeevi received

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గోవా,నవంబర్ 28,2022: ఇంటర్నే షనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్ ముగింపు వేడుకలో మెగా స్టార్ చిరంజీవి 2022 సంవత్సరానికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ ఎడిషన్ ముగింపు వేడుకల్లో టాలీవుడ్ మెగా స్టార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వర ప్రసాద్‌కి 2022 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా IFFI బృందానికి, భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి చిరంజీవి తన తల్లిదండ్రులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, చిరంజీవిగా నాకు పునర్జన్మ ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ఈ పరిశ్రమకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని మెగాస్టార్ అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న చిరంజీవి రాజకీయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనను అంగీకరించినందుకు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘నాపై చూపిన ప్రేమ, ఆప్యాయత చాలా గొప్పది. నేను 45 ఏళ్లకు పైగా పరిశ్రమలో ఉన్నాను.

నేను రాజకీయరంగం నుంచి తిరిగి సినిమా పరిశ్రమకు వచ్చాక, ప్రజలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం కలిగింది. కానీ నా అభిమానుల ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మారలేదు, వారి హృదయాల్లో నా స్థానం చెక్కుచెదరలేదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను, మీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Megastar Chiranjeevi received

అవార్డు అందుకున్న తర్వాత జీవితకాలం విలువైన అనుభవాన్నిఅందించి నందుకు ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీలో ప్రతి ఒక్కరికీ తల వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినీ పరిశ్రమకు రావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి రండి, ఇది అవినీతి లేని వృత్తి, మీలో ప్రతిభ ఉంటే, మీరు దానిని ప్రొజెక్ట్ చేయవచ్చు. మీరు ఆకాశమంత ఎదుగుతారు’ అని ఆయన అన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్టమైన చలనచిత్ర జీవితంలో, చిరంజీవి తెలుగులో 150కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషలలో మెగాస్టార్ చిరంజీవి నటించారు.

ఇవి కూడా చదవండి..

పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్

పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం

త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ కు ఆమోదం..