365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్ ,డిసెంబర్ 6,హైదరాబాద్ :గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నసీనియర్ జర్నలిస్ట్ పీ. వీ.రామ్మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. పీ. వీ.రామ్మోహన్ నాయుడు ఆరోగ్యం బాగోలేదన్న సమాచారం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికెళ్లి నాయుడు యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పీ. వీ.రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ సమయంలో మీడియా సలహాదారుడిగా సేవలందించారు. పీ. వీ.రామ్మోహన్ నాయుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సాయాన్ని అందించడమేకాకుండా, ఆయనకు భరోసా కల్పించారు చిరంజీవి.
