పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బి ఎ) నుంచి మంచి గుర్తింపు వచ్చింది .

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి 28 డిసెంబర్, 2021: శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్  (ఎన్ బి ఎ) నుంచి మంచి గుర్తింపు వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ జెఈవో ( విద్య, వైద్యం) సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

మంగళవారం టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో ఆమె కళాశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, రాయలసీమ లోని 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కేవలం టీటీడీ శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఎన్ బి ఎ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిందన్నారు. కళాశాల లోని ఈ సి ఈ, డి ఫార్మసీ, డి సి సి పి కోర్సులకు గుర్తింపు కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్టులు కూడా ఎన్ బి ఎ కి సమర్పించినట్లు తెలిపారు.

జనవరి చివరలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఎన్ బి ఎ బృందం కళాశాల పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని శ్రీమతి సదా భార్గవి అధికారులకు వివరించారు. ఈ లోపు కళాశాల ఆవరణంలో పూల మొక్కలు, మొక్కలు పెంచి అందంగా తయారు చేయాలన్నారు. ఈ క్లాస్ రూం లు, కొత్త కంప్యూటర్లు, ఎల్సీడి ప్రొజెక్టర్స్, ఇంటర్నెట్ వసతులు కల్పిస్తామని, తగినంత మంది సిబ్బందిని డిప్యూట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దేవస్థానం విద్యాశాఖ ఉపకార్య నిర్వహణాధికారి శ్రీ గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి.అసుంత, న్యాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎల్ ఆర్ మోహన్ కుమార్ రెడ్డి, విభాగాధిపతులు శ్రీమతి సి హెచ్ సరస్వతి, డాక్టర్ ఎం పద్మావతమ్మ పాల్గొన్నారు.