Fri. Apr 26th, 2024
KoTTU_Satyanarayana-

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,డిసెంబర్ 27,2022: ఇంద్ర కీలాద్రి దుర్గగుడి సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ లో ప్రసాదాల పోటు, అన్నదాన భవనం, క్యూలైన్లు కాంప్లెక్స్, మల్టీ లెవల్ బిల్డింగ్ లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

దుర్గ గుడితో పాటు రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలు కూడా మాస్టర్ ప్లాన్లు రూపొందించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

KoTTU_Satyanarayana-

కేంద్ర ప్రభుత్వం కూడా మాష్టర్ ప్లాన్ రూపొందిస్తే ద్వారకాతిరుమల, మోపిదేవి, కాణిపాకం, శ్రీకూర్మం, అరసవెల్లి వంటి దేవాలయాలు అభివృద్ధి చేస్తామన్నారు.

తిరుమల తరహాలో వాస్తుకు అనుగుణంగా దుర్గ గుడిలో ప్రసాదాల పోటు ఆగ్నేయంలో నిర్మిస్తామన్నారు.

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసేందుకు వీలుగా కనకదుర్గా నగర్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కనకదుర్గ నగర్ లో టోల్ ప్లాజా తరహాలో పటిష్ట పరిశీలన తర్వాత మాత్రమే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సీబీఆర్ఏ రూపొందించిన మాష్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత నూతన సంవత్సరంలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఘాట్ రోడ్డులో తాత్కాలిక క్యూలైన్లు కాకుండా కనకదుర్గా నగర్ నుంచి రాజగోపురం వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి, మెట్లు డిజైన్ చేస్తున్నామన్నారు. భక్తులు సేద తీరేందుకు మల్టీ లెవల్ బిల్డింగ్ పైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు.

తాత్కాలిక ఏర్పాట్లు అనే మాట లేకుండా శాశ్వత ప్రతిపదికన మాష్టార్ ప్లాన్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

KoTTU_Satyanarayana-

దసరా, భవాని దీక్షల సమయంలో సైతం భక్తులు రహదారిపై రాకుండా క్యూలైను కాంప్లెక్స్ లో ప్రవేశించి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్లే విధానం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.