Health | రేపటి నుంచి టీటీడీ ఉద్యోగులకు మాస్టర్ హెల్త్ చెకప్..

AP News Featured Posts Health Life Style ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, 16 అక్టోబర్, 2021: టీటీడీ ఉద్యోగుల కోసం సిద్ధం చేస్తున్న స్మార్ట్ కార్డుకు అనుసంధానం చేసేందుకు వీలుగా అక్టోబరు 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నారు.

టీటీడీ ఐటి విభాగం నుంచి తేదీ, సమయాన్ని సూచిస్తూ విభాగాల వారీగా ఎస్ఎంఎస్ లు పంపుతారు. ఉద్యోగులు ఆ సమయానికి మాస్టర్ హెల్త్ చెకప్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉదయం అల్పాహారం తీసుకోకుండా వెళ్లాలి. ఉద్యోగులు గుర్తింపు కార్డుతో పాటు స్విమ్స్ ఓపిడి కార్డు తీసుకెళ్లాలి.