Fri. Apr 26th, 2024
Pininfarina-Battista_365

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై, ఫిబ్రవరి 24,2023: మహీంద్రా పినిన్‌ఫరినా బాటిస్టా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు. తాజాగా భారత్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. మహీంద్రా రూపొందించిన ఈ కారు ఫీచర్లు తెలుసుకుందాం..

మహీంద్రా పినిన్‌ఫరీనాకు చెందిన బాటిస్టా హైపర్ ఎలక్ట్రిక్ కారు భారత గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారు Netrex టెస్ట్ ఫెసిలిటీలో పరీక్ష సమయంలో 358.03 kmph వేగంతో రికార్డు సృష్టించింది. ఈ సమయంలో, కారు 1/4 మైలు,1/2 మైలు స్ప్రింట్‌లను పూర్తి చేసి రికార్డులను సృష్టించింది.

నివేదికల ప్రకారం, బాటిస్టా 1/4 మైలును 8.55 సెకన్లలో 1/2 మైలును 13.38 సెకన్లలో చేరుకుంది. మహీంద్రా నుంచి వచ్చిన ఈ హైపర్ ఎలక్ట్రిక్ కారు పనితీరును రికార్డ్ చేయడానికి VBOX డేటా సిస్టమ్ ఉపయోగించారు.

కారు గరిష్ట వేగాన్ని పరీక్షించడానికి మిచెలిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 టైర్లు వాడారు. పరీక్ష సమయంలో వేర్వేరు డ్రైవర్లు కారును నడిపారు, దీనిలో దాని గరిష్ట వేగం గంటకు 358.03 కిలోమీటర్లుగా నమోదైంది.

Pininfarina-Battista_365

మహీంద్రా యాజమాన్యంలోని కంపెనీ పినిన్‌ఫారినా బాటిస్టా హైపర్ కారు అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే..? 100 కిలోమీటర్లను కేవలం 1.86 సెకన్లలో మాత్రమే చేరుకోగలదు.

అదే 200 కిమీ దూరాన్ని 4.75 సెకన్లు మాత్రమే చేరుకుంటుంది. 12 సెకన్లలో 300 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ICEతో కూడిన అనేక అత్యుత్తమ స్పోర్ట్స్ కార్లు కూడా ఐదు సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు.

మహీంద్రా బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్ ఈ ఫీచర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లీగల్ స్ట్రీట్ కారుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు రిమాక్ నవారా పేరిట ఉంది, ఇది 1.95 సెకన్లలో 100 కిమీ వరకు చేరుకోగలదు.