Fri. Apr 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌ 10నవంబర్‌ 2021: మహదీయ తమ నూతన మేకప్‌ స్టూడియోను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీతో పాటు సినీనటి నమ్రత శిరోద్కర్‌, నటుడు అలీ రెజా ఖెరాద్మంద్‌, భారతీయ మోడల్‌, నటుడు టెలివిజన్‌ పర్సనాలిటీ రోహిత్‌ ఖండేల్‌వాల్‌,ఎంటీవీ రోడీస్‌ పోటీదారు జబీ ఖాన్‌ పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మహదీయ దర్వేష్‌ మాట్లాడుతూ ‘‘చిన్నతనం నుంచి నాకు మేకప్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. నా కల నిజమైన రోజు ఇది. నా కల సాకారం కావడంలో మా నాన్న నాకు ఎంతగానో సహాయపడ్డారు.ఈ స్టూడియో గోడలు, డెకార్‌కు విలాసమే స్ఫూర్తి. ఈ మహదీయాస్‌ మేకప్‌ స్టూడియో ప్రధాన లక్ష్యం , వినియోగదారుల సంతృప్తి. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి మోములోనూ చిరు నవ్వు చూడాలన్నది నా కోరిక. కలలకు వాస్తవ రూపాన్ని ఈ స్టూడియో అందిస్తుంది’’ అని అన్నారు.

ఈ స్టూడియో పలు సేవలను అందిస్తుంది. వీటిలో అన్ని సందర్భాలకూ తగిన రీతిలో మేకప్స్‌,హెయిర్‌డూస్‌, అన్ని రకాల డ్రేపింగ్స్‌,జ్యువెలరీ మొదలైనవి ఉన్నాయి. వివాహం, పార్టీలు, పండుగలు మొదలైన సందర్భాల కోసం అత్యుత్తమ ఔట్‌ఫిట్స్‌, ఆభరణాల అవసరాలను సైతం ఇది తీరుస్తుంది. ఇక్కడి మేకప్‌ నైపుణ్యత, ఇతరులకు భిన్నంగా మహదీయా స్టూడియోను నిలుపుతుంది.

ఈ స్టూడియో అత్యంత విలాసవంతమైన ప్రాంగణంలో ఉంది. ఆధునిక, క్లాసికల్‌ అందాల సమ్మేళనంలా ఈ స్టూడియో ఉంటుంది. వినియోగదారులకు వినూత్నమైన అనుభవాలను అందించడానికి మహదీయ కట్టుబడి ఉంది. దీని కలర్‌ పాలెట్‌, బంగారం, ఆఫ్‌-వైట్‌, బీగ్‌, మరూన్‌ రంగులలో ఉంటుంది. మహదీయ మేకప్‌ స్టూడియో విలాసవంతమైన, పర్శియన్‌–ఇరానియన్‌ స్ఫూర్తిని ప్రతిబింబించడంతో పాటు అన్ని విధాలుగానూ ప్రత్యేక అనుభవాలను మిగులుస్తుంది.

ఇరాన్‌లోని మేకప్‌ సంస్కృతితో అధికంగా స్ఫూర్తి పొందిన మహదీయ, ఆ స్ఫూర్తిని ఇండియాకు తీసుకురావాలని కోరుకోవడమే కాదు, ఈ రెండు సంస్కృతుల అద్భుతమైన సమ్మేళనం సృష్టించాలని, అదీ ఇతరులకు భిన్నంగా ఉండేలా ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించాలని కోరుకుంది. ఆమె మేకప్‌, మేకప్‌ స్టూడియో రెండూ కూడా ఇరానియన్‌ నైపుణ్యం కలిగి ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్టూడియో సహాయపడుతుంది.