Fri. Mar 29th, 2024
Madi-Movie

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 8,2022: ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా మది. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా, ఆర్ వి రెడ్డి సమర్పణలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతుంది. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

నాగ ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టొరీ గా రాబోతున్న “మది” ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేల ఉంటూ, వినూత్నరీతిలో కథనం సాగుతుంది. కథ-సందర్భానుసారంగా ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి, రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించడం జరిగింది.

Madi-Movie

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మది నవంబర్ 11న థియేటర్స్ లో విడుదల కానుంది.వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్ కిషన్, సహా నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి తెలిపారు.

తారాగణం:

శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ తదితరులు

Madi-Movie

కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగ ధనుష్
కెమెరామెన్: విజయ్ ఠాగూర్
మ్యూజిక్: పివిఆర్.రాజా
ఆర్ట్: విజయ్
ఎడిటర్: ప్రదీప్. జంబిగ
లిరిక్స్: కడలి, పూర్ణ చారి
సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: రామ్ కిషన్
సహా నిర్మాత: శ్రీనివాస్ రామిరెడ్డి
పీఆర్ఒ: శ్రీధర్