Thu. Mar 28th, 2024
koneru-centre-in-bandaru
koneru-centre-in-bandaru

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మచిలీపట్నం, జూన్ 17,2022: సుందర నగరంగా ప్రకటించబడిన కృష్ణా జిల్లా కేంద్రం మచిలిపట్ణణం లో గత బుధవారం ఇతర ప్రాంత పాత్రికేయులు వివిధ ప్రాంతాలను చూసి షాక్ తిన్నారు. కోనేరు సెంటర్ని, దాని చుట్టూ చెతురస్రాకారంలో ఎంతో అందంగా ఆనాడే ఏర్పరచిన సెంటర్ చుట్టూ రెండు రోడ్లు మూసేసి పూర్తీగా ఎవరి దుకాణం ముందు వారే స్వంతదారులు వారికి చెందిన సరకులు వీధుల్లో పెట్టి రోడ్లు పూర్తీగా మూసేసిన రోడ్లు, మైన్ రోడ్లను విస్తరించేందుకు అనేక షాపులను కూల్చి విస్తరించిన రోడ్లపై పూలు పళ్ళు,ఇతర బళ్ల పై వ్యాపారాలు, కెడిసిసి బాంక్ రోడ్ సెంటర్ నుంచి బెల్లంకోట్ల వరకు బళ్లు, పాతకలపలతో నింపేసి ఎప్పుడు ఎవరిమీద పడతాయో తెలియని రోడ్లు, ఎక్కడబడితే అక్కడ ప్రధాన రోడ్లపై నిలిపిన వాహనాలు, మెయిన్ రోడ్లమీదే తిష్టవేసిన ఆవులు,గెదలు, రోజు జిల్లా ఉన్నతాధికారులు విజయవాడకు రాకపోకలు సాగించే బైపాస్ రోడ్డు మలుపులో కూడా ఒక వ్యాపార సంస్థ పార్కింగ్ ప్లేస్ కోసం వినియోగించుకునే తీరు చూసినా ఈ నగరానికి అందమైన నగరంగా కమిటీ వారు ఎంపిక చేశారు.

అంటే వారు చాలా మంచి హృదయం కలిగిన వారైవుండాలని, అలాగే ఆక్రమణలను నిరోధించాల్సిన నగరపాలక సంస్థ కార్యాలయం ప్రక్కనే ఆక్రమించుకుని రోడ్డు ఇరుకుగా మర్చివేసినా పాలికల అధికారులతో మూర్తీభవించిన మంచితనం మెచ్చుకున్నారు. నిత్యం అధికారులు తిరుగాడే ప్రధాన సెంటర్ కోనేరు సెంటర్ చుట్టూ ఇలా ఉంటే ఇక మారు మూల ప్రాంతాల్లోని ప్రభుత్వభూములు,పార్కులు కబ్జాకు గురికాకుండా ఉంటాయా అనే అనుమానం కలిగింది.ఇక ఆటోలు,వాహనాల తీరు చూస్తే అవి ఉన్నఫలంగా ఎటుతిప్పుతారో తెలియక గుండెగుభేల్మన్న వాటి తీరు చూస్తే వారికి ట్రాఫిక్ ఆంక్షలు తెలియనట్లన్పించింది. ప్రధాన రోడ్లలో నిర్మించిన డివైడర్లు ఎలా ఏ కొలతల ప్రకారంఅలా ఎక్కువ తక్కువగా కట్టారో దేవునికే ఎఱుక.

machilipatnam


ఏతా వాతా చెప్పెదేమంటే ఈ ఊరి ప్రజలు,అధికారులు అందరూ మంచివారు. ఎవరు ఏమిచేసినా ఏమీ అనరు. అందుకే ఇంత మంచి హృదయం ఉన్నందుకే సుందర నగరం అని ఇచ్చారు గాని, పట్టణం అందంగా ఉందని కాదనిపించింది. ఈ రోడ్లుపై ఆక్రమణలు తొలగిస్తారు, ఎప్పుడు ఈ ఊరి ప్రజలు ఇక్కడ బజార్లు ఉన్నాయి అనుకుంటారో అనిపించింది. ఆ పురాతన పట్టణం చూసేందుకు వెళ్లిన మాకు ఏమీ పట్టించుకోని ప్రజలు,పట్టని అధికారులు, ఇలా “ఎవరికి వారే యమునా తీరేలా” ఉన్న ఇంత మంచి ఊరు గురించి చూశాక రాయలేకుండా ఉండలేక రాయాల్సి వచ్చింది మరి.