శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

AP News Devotional Featured Posts National Top Stories Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, న‌వంబ‌ర్24, 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుప‌తి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.