Fri. Mar 29th, 2024
JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల,జూన్ 13.2021 : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌పాటు జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.


JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24
JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24
JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24

రెండో రోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24
JYESTABHISHEKAM IN SRI TT FROM JUNE 22-24

ఆర్జితసేవలు రద్దు :

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో చివరిరోజైన జూన్ 24న వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవలైన క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది.