Sat. Apr 20th, 2024
JSW Cement dedicates new Balaji temple to the community of Nandyal

365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,నంద్యాల, జూన్ 27,2020:భారతదేశంలో సుప్రసిద్ధ గ్రీన్ సిమెంట్ ఉత్పత్తిదారు,14 బిలియన్ డాలర్ల జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌లో భాగమైన జెఎస్‌డబ్ల్యు సిమెంట్ నూతన బాలాజీ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో నిర్మించింది. బిల్కలగూడూరు గ్రామంలో ఉన్న, నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని బ్లాక్ లైమ్‌స్టోన్ వినియోగించి 2.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. బాలాజీ దేవాలయం యొక్క నిర్మాణ శైలి మహోన్నతమైన భారతీయ దేవాలయ శిల్పకళాచాతుర్యతను ప్రదర్శించడంతో పాటుగా ఈ దేవాలయం డిజైన్‌ను 10వ శతాబ్దం నుంచి ఉన్న తిరుపతిలోని బాలాజీ దేవాలయం నమూనాను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. నంద్యాలలోని నూతన బాలాజీ దేవాలయంలో బాలాజీ , వరహాస్వామి ప్రతిమలు బ్లాక్‌లైమ్‌స్టోన్ జిగ్గార్ట్స్‌లా ఉంటాయి. జెఎస్‌డబ్ల్యు వద్ద, బాలాజీ దేవాలయ ప్రాజెక్ట్‌కు శ్రీమతి అనూశ్రీ జిందాల్ నేతృత్వం వహించారు. భారతీయ ఆర్కిటెక్ట్ , సమీప్ పదోరా అండ్ అసోసియేట్స్ సమీప్ పదోరా దీనికి ముఖ్య ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. జెఎస్‌డబ్ల్యు యొక్క సీఎస్ఆర్ నిధుల ద్వారా నిధులను జెఎస్‌డబ్ల్యు సమకూర్చడంతో పాటుగా ఈ దేవాలయాన్ని నందాల్య ప్రజలకు అంకితం చేసింది.ఈ దేవాలయ ప్రాజెక్ట్ ద్వారా జెఎస్‌డబ్ల్యు సిమెంట్ యొక్క లక్ష్యం, దేవాలయానికి సంబంధించి ప్రజల సాంస్కృతిక అంచనాలను అందుకోవడం,ఎన్నో సంవత్సరాలుగా నీటి వనరుల లభ్యత తక్కువ కావడంతో ఎడారిలా మారుతున్న ప్రాంతంలో దానిని పునరుద్ధరించడం. ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలు పత్తి, మిరప పంట సాగుకు గుర్తింపు పొందాయి. అందువల్ల, ఈ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడి మెరుగు పరిచేందుకు నీటి వనరులను పునరుద్ధరించడం కీలకం.

జెఎస్‌డబ్ల్యుకు చెందిన శ్రీమతి అనూశ్రీ జిందాల్ మాట్లాడుతూ “స్థానిక ప్రజలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా వారికి మెరుగైన భవిష్యత్‌ను అందించడాన్ని జెఎస్‌డబ్ల్యు విశ్వసిస్తుంటుంది. నంద్యాల పట్టణ ప్రజలకు ధర్మబద్ధమైన, సురక్షితమైన ఆరాధనకు వీలుగా ఈ దేవాలయాన్ని నిర్మించే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడని భావిస్తున్నాను. పార్ద్,నేను ఈ నూతన బాలాజీ దేవాలయాన్ని స్థానిక ప్రజలు,వెంకటేశ్వర స్వామి భక్తులకు అంకితమిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. స్థానిక ప్రజలకు ప్రశాంతమైన సామాజిక సమావేశాలకు, మనశ్శాంతిని అందించే రీతిలో ఈ దేవాలయాన్ని రూపొందించాం. ఈ దేవాలయం నిర్మించిన ప్రదేశంలో సహజసిద్ధమైన కాలువ ఉంది. అది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఈ నూతన దేవాలయాన్ని మేము అత్యంత జాగ్రత్తగా ఆ కాలువ తిరిగి పునరుద్ధరించబడేలా తీర్చిదిద్దాం,ఈ ప్రాంతంలోని స్ధానిక వ్యవసాయ అవసరాలకు తోడ్పడేలా నీటిని అందించేందుకు ఇది తోడ్పడుతుంది” అని అన్నారు.

JSW Cement dedicates new Balaji temple to the community of Nandyal
JSW Cement dedicates new Balaji temple to the community of Nandyal

దేవాలయ డిజైన్ గురించి సమీప్ పదోరా, ఫౌండర్ ఎస్‌పీ+ఏ మాట్లాడుతూ “అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం నిర్మించేందుకు మాకు జెఎస్‌డబ్ల్యు అవకాశమందించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. బాలాజీ దేవాలయ సంప్రదాయ ప్రణాళిక మౌలిక సూత్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల సామాజిక-సంస్కృతిక అంచనాలను అందుకోవాలని భావించాం. అదే సమయంలో ఈ ప్రాంతంలో భూగర్భజలాలను సైతం పునరుద్ధరించరేందుకు ప్రణాళిక చేశాం” అని అన్నారు.బాలాజీదేవాలయం నిర్మాణంతో పాటుగానే పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించి భూగర్భజలాలను వృద్ధి చేశారు. దేవాలయ ప్రాంగణంలో లోతుగా ఉన్న ప్రాంతాన్ని నీరు నిల్వ చేసే చెరువుగా మార్చి , దగ్గరలోని లైమ్‌స్టోన్ క్వారీ నుంచి నేరుగా ఇక్కడకు వచ్చేలా చేశారు. లైమ్‌స్టోన్ క్వారీల నుంచి వచ్చే నీరు కుండ్ రీచార్జ్ కోసం వినియోగించారు. అక్కడే ఘాట్స్ కూడా నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవాలయంలో మూడు ప్రధానాంశాలు కనిపిస్తాయి. అవి బాలాజీ విగ్రహం, వరాహస్వామి మూర్తి,ఫుష్కరిణి. ఈ దేవాలయాన్ని స్వీయమద్దతు పొందిన కట్టడంగా స్ధానికంగా లభించే బ్లాక్ లైమ్‌స్టోన్ స్లాబ్స్‌ను వినియోగించి నిర్మించారు. నీటి కుంటల యొక్క గట్లను ఘాట్ రూపంలో కమ్యూనిటీ స్పేస్‌గానూ వినియోగించవచ్చు. ఈ దేవాలయం అత్యంత అందంగా విలక్షణమైన హిందూ దేవాలయం యొక్క కొన్ని కీలకాంశాలను అందంగా అనుకరిస్తుంది కానీ వాటిని ప్రతిబింబించకుండా వైవిధ్యమైన భాగాలతో తిరిగి వాటిని జ్ఞప్తికి తెస్తుంది.భారతీయ కళ, వారసత్వంను తమ సీఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా కాపాడటంతో పాటుగా పునరుద్ధరించడంపై జెఎస్‌డబ్ల్యు దృష్టి సారించింది. గత కొద్ది సంవత్సరాలుగా ఇది కర్నాటకలోని హంపి వద్దనున్న 15వ శతాబ్దపు చంద్రమూలేశ్వర దేవాలయం, మహారాష్ట్రలో ముంబైలోని కేనెసేథ్ ఇలియాహూ సినగోగ్యు, హంపి లోని కృష్ణ దేవాలయం పునరుద్ధరించింది. అలాగే బల్లారీలో కళాధామ్ ఆర్ట్ విలేజ్‌ను ఏర్పాటుచేయడం కూడా చేసింది. సమాజ చరిత్ర,కట్టడాలు దాని సభ్యులకు అత్యున్నత కీర్తి కిరీటాలుగా నిలుస్తాయని జెఎస్‌డబ్ల్యు విశ్వసిస్తుంది. ఈ కట్టడాలు మహోన్నత వారసత్వానికి ప్రతీకలు మరియు ఈ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా వాటిని పునరుద్ధరించడమనేది స్ధానిక కమ్యూనిటీలకు సాధికారిత కల్పించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది.