Fri. Mar 29th, 2024
Johnson Pedder launches all-new ‘Max Series’, offering complete bathroom solutions

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూ ఢిల్లీ, 10ఫిబ్రవరి  2021: రోకా గ్రూప్ ఛత్రం కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జాన్సన్ పెడర్ తన సరికొత్త ‘మ్యాక్స్ సిరీస్’ ఉత్పత్తి శ్రేణిని ఈరోజు ప్రారంభించింది. గరిష్ట దృఢత్వం, నాణ్యత, అందుబాటు ధర,10 సంవత్సరాల వారెంటీ హామీతో లభించే సిరీస్ ఉంది. ఈ ‘మ్యాక్స్ సిరీస్’లో శాన్‌వేర్, ఫాసెట్‌లు, ప్లాస్టిక్స్,వాటర్ హీటర్‌ల వంటి అన్ని బాత్రూమ్ విభాగాలు ఉంటాయి. అందుబాటు ధరలో అధిక నాణ్యత కలిగిన బాత్రూమ్ ఉత్పత్తులు కోరుకునే ప్రారంభ-స్థాయి వినియోగదారులను ఆకట్టుకునే లక్ష్యంతో, జాన్సన్ పెడర్ ఈ సరికొత్త ఉత్పత్తి శ్రేణిని అందుబాటులోకి తెచ్చింది.శాన్‌వేర్ శ్రేణిలో మూడు వేరియెంట్ల వాల్ హ్యాంగ్ బేసిన్లు – మ్యాక్స్ ఎక్సెల్, మ్యాక్స్ స్పార్కిల్, మ్యాక్స్ గ్లీమ్, మ్యాక్స్ గ్లో – ,ఐదు వేరియెంట్ల వాటర్ క్లోసెట్లు – మ్యాక్స్ స్పార్క్ వాల్ హ్యాంగ్, మ్యాక్స్ ఆర్క్ సింగిల్ పీస్, మ్యాక్స్ డాజ్ కన్సీల్డ్ యూరోపియన్ వాటర్ క్లోసెట్, మ్యాక్స్ యూరోపియన్ వాటర్ క్లోసెట్ ఎక్స్‌పోజ్డ్,మ్యాక్స్ స్క్వాటింగ్ పాన్ అనేవి భాగంగా ఉంటాయి.

Johnson Pedder launches all-new ‘Max Series’, offering complete bathroom solutions
Johnson Pedder launches all-new ‘Max Series’, offering complete bathroom solutions

అలాగే, ఫాసెట్ల్ కలెక్షన్ విభాగంలో బేసిన్ మిక్సర్లు, వాల్ ,సింక్ మిక్సర్లు, బిబ్ ట్యాప్‌లు మొదలుకొని బాత్ స్పౌట్‌ల వరకు 19 SKUలను ‘మ్యాక్స్ ఫ్లో’ పరిచయం చేసింది. ప్రీమియం నాణ్యత,మృదువైన పనితీరు కలిగిన ఈ ఫాసెట్లు బాత్రూమ్‌లకు సొగసైన రూపం అందించడంతో పాటు హామీ, దృఢత్వం అందిస్తాయి. అంతేకాకుండా, మృదువైన పనితీరు,సుదీర్ఘ జీవితకాలం కోసం సెరామిక్ ఇన్నర్ హెడ్‌తో పాటు స్మూత్ ఫోమ్ ఫ్లో సాంకేతికతతో ఈ ఫాసెట్లు తయారయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, పరిశుభ్రతను కూడా దృష్టిలో ఉంచుకుని,  ‘మ్యాక్స్ హైజీన్’ పేరుతో సులభంగా ఉపయోగించగల సెన్సార్ ఫాసెట్‌ను కూడా ఈ బ్రాండ్ పరిచయం చేసింది. డిసి,ఏసి-డిసి రెండింటిలోనూ పనిచేసే పిల్లర్ కాక్ ఇందులో భాగంగా ఉంటుంది.‘మ్యాక్స్ సిరీస్’  ప్రారంభోత్సోవ కార్యక్రమంలో భాగంగా, జాన్సన్ పెడర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.ఇరంగనాథన్ మాట్లాడుతూ భారతదేశపు శానిటరీ వేర్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో, అందుబాటు ధర శ్రేణిలో బాత్రూమ్‌ సొగసును సంవృద్ధం చేయాలని కోరుకునే బ్రాండ్ ప్రేమికుల కోసం జాన్సన్ పెడర్ ఒక ప్రముఖ బ్రాండ్‌గా స్మార్ట్ ఛాయిస్ తీసుకొచ్చింది.వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఆధునికమైన, స్టైల్,అధునాతన బాత్రూమ్ ఫిట్టింగ్‌లు అందుకునేలా వారిని ప్రోత్సహించడాన్ని దృష్టిలో ఉంచుకుని మా మ్యాక్స్ సిరీస్ రూపొందించబడింది. దృఢత్వం, అందుబాటు ధరతో పాటు మరీ ముఖ్యంగా నాణ్యత విషయంలో ఈ ఉత్పత్తులు మ్యాక్స్ (గరిష్టం)గా ఉండడం వల్ల మ్యాక్స్ అనే పేరు సైతం వీటికి తగినదిగా ఉంటుంది. మహమ్మారి కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ జాన్సన్ పెడర్ అత్యద్భుతమైన వృద్ధిని సాధించడంతో పాటు అత్యధిక రేటులో వృద్దిని కొనసాగిస్తోంది  అన్నారు.

Johnson Pedder launches all-new ‘Max Series’, offering complete bathroom solutions
Johnson Pedder launches all-new ‘Max Series’, offering complete bathroom solutions

కొత్త వేరియెంట్లలో లభించే వాటర్ హీటర్లను కూడా ఈ బ్రాండ్ పరిచయం చేస్తోంది. 6-25 లీటర్ల శ్రేణిలో ఇవి నాలుగు విభిన్న సైజుల్లో లభిస్తాయి. ఇన్‌బిల్ట్-థర్మోస్టాట్, ఆటో థెర్మల్ కటాఫ్, సేఫ్టీ వాల్వ్, ఫ్యూసింగ్ ప్లగ్, సింగిల్ వెల్డ్ ట్యాంక్,విద్యుత్ పొదుపు కోసం అధిక-సాంద్రత కలిగిన ఇన్సులేషన్ లాంటి విశిష్టతలు వీటిలో లభిస్తాయి. జాన్సన్ పెడర్ ఉత్పత్తులన్నీ అత్యున్నత నాణ్యతా పరీక్షలను పూర్తి చేసుకోవడంతో పాటు పరిశ్రమ-ప్రామాణిక మార్గదర్శకాలకు లోబడి తయారు కావడం వల్ల ఇవి వినియోగదారుల విభిన్న అవసరాలకు తగినట్టుగా ఉండడంతో పాటు దృఢంగానూ,సంతృప్తిక రంగానూ ఉంటాయి. ‘మ్యాక్స్ సిరీస్’ శ్రేణి ఉత్పత్తులు భారతదేశవ్యాప్తంగా లభిస్తాయి.