Sat. Apr 20th, 2024
Joginaidu_365telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, ఫిబ్రవరి18,2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నటుడు ఎల్. జోగి నాయుడును నియమిస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

Joginaidu_365telugu

ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఈ మేరకు జీవో నంబర్ 46 జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.