Fri. Apr 26th, 2024
pregnant_-women

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్14,2022: చేదుగా ఉండే కాకరకాయ ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. చేదుగా ఉన్నా విలువైన పోషకాలుంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినాలని చెబుతు న్నారు. ప్రెగ్నెన్సీ టైం అనేది మహిళలకు చాలా కీలకమైంది. అయితే ఆ సమయంలో గర్భిణీలు కొన్నిరకాల కాయలు తినకూడదని చెబుతుంటారు. అటువంటి వాటిలో కాకరకాయ తినొచ్చా..?లేదా..? అనే సందేహం చాలా మందిలో ఉంది.

అది ఎంత మాత్రం వాస్తవం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మంచి పౌష్టికాహారం తీసుకున్నప్పుడే శిశువు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది. గర్భిణీ సమయంలో జీర్ణసంబంధిత సమస్యలు రావడం సాధారణ విషయమే. గర్భాశయ విస్తరణ, స్టెనోసిస్, విరేచనాలు, కడుపు నొప్పి వంటి శరీరంలోని వివిధ హార్మోన్లు, స్రావాలలో తీవ్రమైన హెచ్చు తగ్గులు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు. కాబట్టి కాకరకాయలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉన్నందున జీర్ణక్రియకు కూడా మంచిది.

pregnant_-women

చిన్న అనారోగ్యాలు కూడా గర్భధారణ సమయంలో పెద్ద సమస్యగా ఉంటాయి. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తాయి. అందువల్ల గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మీ డైట్‌లో కాకరకాయ చేర్చి ఇబ్బందికరమైన సమస్యలను నివారించి గర్భం మాధుర్యాన్ని ఆస్వాదించండి. కాకరకాయలో విటమిన్ “సి “పుష్కలంగా ఉంటుంది. విటమిన్” సి “సాధారణ రోగాలతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది.

గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో మలబద్ధకం ఒకటి. కాకరకాయలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటిలో ఎక్కువ భాగం పై తొక్కలో ఉంటుంది. కానీ చాలామంది ఫై తొక్క తీసేసి వండుకుంటారు.ఫై తొక్క తీయకుండా వండుకోవడంవల్ల ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించడానికి ఉపకరిస్తుంది.

గర్భధారణ సమయంలో కాకరకాయ లేదా కాకరకాయ గింజలు తింటే కడుపునొప్పి, అజీర్ణం, విరేచనాలు, కడుపులో నొప్పి వస్తాయని మరికొందరు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కాకరకాయ రసం తాగడం వల్ల సంకోచాలు ఏర్పడి రక్తస్రావం కూడా జరుగుతుందని, ఇది అబార్షన్‌కు దారితీస్తుందని కొందరు నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఈసందర్భాల్లో డాక్టర్లను సంప్రదించి వారి సలహాను పాటించడం మేలు.