365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,18 ఏప్రిల్ 2023: స్వీయ భరోసా ఉన్న ఆధునిక మహిళ కోసం భారతదేశానికి చెందిన చక్కటి ఆభరణాల బ్రాండ్ ఇరస్వ ఫైన్ జ్యువెలరీ.
ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న తన ప్రస్తుత దుకాణాలు విజయ వంతమైన తర్వాత హైదరాబాద్‌లోని మహిళల కోసం ఐరస్వ చక్కటి వజ్ర, జెడావ్ ఆభరణాలను పరిచయం చేయడం ద్వారా హైదరాబాద్‌లో రిటైల్ ఉనికిని ఏర్పరుచుకునేందుకు సిద్ధమవుతోంది.
బంజారాహిల్స్ లో నెలకొల్పబడిన ఈ కొత్త స్టోర్ హైదరాబాద్‌లోని కొనుగోలుదారుల విలాస, జీవనశైలి అవసరాలను తీరుస్తుంది.

ఓపెన్ డిజైన్ లేఅవుట్, సమకాలీన ఫకేడ్ డిస్‌ప్లేలు, ఆభరణాల ప్రదర్శనల ద్వారా, కస్టమర్‌లు తమ వ్యక్తిగత కోరికలను గుర్తించే స్థలంలో షాపింగ్ చేసే సాధికారికత పొందుతారు. అదే సమయంలో ఇది వారికి బ్రౌజ్ చేయ డానికి, అన్వేషించడానికి, నచ్చిన వాటితో మమేకం అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
స్టోర్ డిజైన్ చక్కదనాన్ని అందిస్తుంది. భయపెట్టకుండా ప్రత్యేకమైన, వ్యక్తిగతీకరించిన స్టోర్ అనుభవాన్ని అం దిస్తుంది.అనుబంధాన్ని పెంపొందించుకునేలా అక్కడ తిరిగేందుకు, సంభాషించేందుకు, భాగస్వామ్యం కావడానికి మరిన్ని కారణాలను జోడిస్తుంది.
ఇరస్వ బ్రాండ్ వెనుక ఉన్న దీర్ఘకాలిక దృష్టి ఏమిటంటే, ఒకే చోట చక్కటి ఆభరణాలను అందించేలా ఓమ్ని-ఛానల్ విధానం ద్వారా భారతదేశం అంతటా రోజువారీ, సందర్భానుసార ఆభరణాల కోసం ఎంపిక చేసిన అవుట్‌లెట్‌లను తెరవడం.
ఈ సందర్భంగా ఇరస్వ సీఈఓ కేతన్ పటేల్ మాట్లాడుతూ, ‘‘ఈ స్టోర్ ప్రారంభం గురించి మేం చాలా సంతోషి స్తున్నాం, మా వజ్రాల వలె బలమైన బంధాలను ఇది నిర్మించాలని మేం కోరుకుంటున్నాం.
మా కస్టమర్లు మా పెద్ద కుటుంబం, మేం వారిలో చాలా మందితో చాలా సన్నిహిత సంబంధాన్ని పంచుకుంటాం. ఒకసారి మీరు ఇరస్వ ఆభరణాన్ని కొనుగోలు చేస్తే, మీరు నిజంగా మా కుటుంబంలో భాగమవుతారు’’ అని అన్నారు.

2019లో స్థాపించిన ఇరస్వ స్త్రీ వివిధ కోణాల అభివృద్ధి చెందుతున్న వ్యక్తీకరణ. నేటి మహిళల స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, స్వతంత్రతలను వేడుక చేసుకుంటూ, ఐరస్వ నగల శక్తి, దానితో మహిళలు పంచుకునే సన్నిహిత సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది.
ఇరస్వ ముంబై, అహ్మదాబాద్‌లో 2 స్టాండ్ ఎలోన్ లేదా బోటిక్ స్టోర్‌లను కలిగి ఉంది, త్వరలోనే ముత్యాలనగరమైన హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.