Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 16, 2021: అగ్రగామి బి2బి ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ‘ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇం డియా’ రెండు రోజుల రెన్యువబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్ పో అయిన రెన్యూఎక్స్ 5వ ఎడిషన్ ను ప్రకటించింది. ఇది హైదరాబాద్ లోని హైటెక్స్ లో నవంబర్ 19, 20 తేదీల్లో జరుగనుంది. ‘ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇం డియా’ రెన్యూఎక్స్ 2021 ద్వారా పునరుత్పాదక విభాగంలో వ్యాపార అవకాశాలకు సంబంధించి పరస్పరం అనుసంధానమయ్యేందుకు, కలసి పని చేసేందుకు విక్రేతలు, కొనుగోలుదారులకు ఒక పారిశ్రామికవేదికను అందిస్తోంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద షోలలో ఒకటైన రెన్యూఎక్స్ దక్షిణ భారతదేశ గ్రీన్ ఎకానమీ కమ్యూనిటీ అంతా ఒక్క చోటుకు చేరడానికి వేదిక కానుంది. పరిశ్రమ ధోరణులు, సవాళ్లు, మార్కెట్ దృక్పథాలు లాంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.

ఆర్ఇ రంగాలు, తయారీ సంస్థలు, ఈపీసీ కంపెనీలకు చెందిన విధాన నిర్ణేతలు, పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్ మెంట్స్, ఇన్వర్టర్లు, చార్జ్ కంట్రోలర్స్, బ్యాటరీలు, టెస్టింగ్ అండ్ మాని టరింగ్ సిస్టమ్స్, కాంపొనెంట్ తయారీదారులు, బయోఎనర్జీ ఉపకరణాల తయారీదారులు, బ్యాక్ షీట్ తయారీదారులు, సిస్టమ్స్ ఇంటిగ్రేటర్స్ తో పాటుగా వివిధ విభాగాల సరఫరాదారులు, పంపిణిదారులు ఒక్క చోటుకి తీసుకురావడం ఈ షో ఆశయం.

షో ఇప్పుడు భౌతికంగా తిరిగి రావడంతో, దేశవ్యాప్తంగా ఇదెంతో కుతూహలం రేకెత్తిస్తోంది. ప్రదర్శనకు తెలంగాణ భాగస్వామ్య రాష్ట్రంగా ఉంది. తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరెషన్ లిమిటెడ్ ఈ షో కు నోడల్ ఏజెన్సీగా ఉంది. ఈ ఏడాది, మొదటిసారిగా ఈ ఎక్స్ పో లో ‘పార్ట్ నర్ కంట్రీ’గా యూకే చేరింది. రెండు రోజుల కాన్ఫరెన్స్, ప్రోడక్ట్ షో కేస్, యూకే పెవిలియన్ రూపంలో పెవిలియన్స్, పరిశ్రమకు చెందిన ప్రముఖ సంస్థలైన గ్రీన్ కో గ్రూప్, లాంగి సోలార్, గిన్ లాంగ్ సోలిస్, ప్రీమియర్ ఎనర్జీస్, వాట్ క్రాఫ్ట్, గోల్డి సోలార్, ఎవ్వో సోలార్, పెన్నార్ ఇండస్ట్రీస్, రేజాన్ గ్రీన్ ఎనర్జీస్, యాక్సిటెక్ ఎనర్జీ, నోవాసిస్ గ్రీనెర్జీ, ఆర్ఈసీ సోలార్ కెసొలారె ఎనర్జీ లాంటివి ఉన్నాయి.

ఈ ప్రదర్శనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడిబి), నేషనల్ హైవే ఫర్ ఈవీ, ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ (ఐఈఎస్ఏ), ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ), ఇఎల్ఐఏపీ, టెల్మా, క్రెస్మా, నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇఎఫ్ఐ), టిఎస్ఇఎ, ఇండో జర్మన్ ఎనర్జీ ఫోరమ్ (ఐజీఈఎఫ్) లాంటివి ఈ కార్యక్రమానికి అండగా నిలిచాయి. మొదటి రోజున క్లోజ్డ్ డోర్ సీఈఓ కాన్ క్లేవ్ జరుగనుంది. ‘ఫ్రమ్ యాంబిషన్ టు యాక్షన్ -ఎ విజినరీ డిబేట్’ కు ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం, ఐటి) అధ్యక్షత వహించనున్నారు. ఐఎఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ విభాగం మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా సహ- అధ్యక్షత వహిస్తారు.ఈ సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేశ్ ముద్రాస్ మాట్లాడుతూ, ‘‘భారతదేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగం యావత్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ రెన్యువబుల్ ఎనర్జీ మా ర్కెట్ గా ఉంది. 2021 జులై నాటికి భారతదేశం 96.96 జిడబ్ల్యూ పునరుత్పాక శక్తిని కలిగిఉంది. ఇది దీ నికి సంబంధించిన మొత్తం వ్యవస్థాపక సామర్థ్యంలో 25.2 శాతంగా ఉంది. భౌగోళికంగా, వాతావరణపరం గా సౌర శక్తికి దేశంలో అపార అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇది పోటీదాయక ప్రయోజనా న్ని కూడా అందిస్తుంది. అంతేగాకుండా భారతదేశం అగ్రిపివి (AgriPV) ఆలోచన కూడా చేస్తోంది. సౌరశక్తి సంబంధిత కంపెనీలు, వ్యవసాయం చేస్తున్న కంపెనీలు కలసి భూమిని అటు ఆహారోత్పాదనకు, ఇటు సౌ ర శక్తి ఉత్పాదనకు వినియోగించే విధానాలపై అధ్యయనాలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా గ్రీ న్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు ప్రకటించింది. 2030 నాటికి 450 జిడబ్ల్యూ పునరుత్పా దక శక్తిని ఉత్పత్తి చేసేందుకు భారీస్థాయి సుస్థిర ప్రాజెక్టులను చేపట్టింది. ఈ రంగానికి ప్రభుత్వ మద్దుతు తో, మెరుగుపడిన ఆర్థిక వ్యవస్థలతో ఈ రంగం ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయమైందిగా మారుతోంది’’ అని అన్నారు.

‘‘ఈ ఏడాది రెన్యూఎక్స్ 2021 ఐదో ఎడిషన్ తో ఇన్ – పర్సన్ ఫార్మాట్ లో తిరిగి వస్తున్నందుకు మేమెం తో ఆనందిస్తున్నాం. పునరుత్పాదక శక్తి పరిశ్రమలకు, నిపుణులకు ఇదో చక్కటి వేదిక. తమ ఉత్పత్తు లను ప్రదర్శించేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు ఇది విక్రతలకు, కొనుగోలుదారులకు వివిధ అవకాశాలను అందిస్తుంది. మా రి-స్టార్ట్ 2.0 లో పరిశ్రమ నుంచి ఈ విధమైన సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ ఎడిషన్ తో, రాబోయే ఏళ్లలో కూడా ఈ రెన్యూఎక్స్ ను మరింత ఉన్నత శిఖరాల కు చేరుస్తాం’’ అని అన్నారు.

దేశీయంగా, అంతర్జాతీయంగా పునరుత్పాదక ఇంధనవరుల మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి పంచుకునేందుకు రెన్యూఎక్స్  తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా 2 రోజుల శక్తివంతమైన కాన్ఫరెన్స్ ను ‘సౌత్ ఇండియా ఎనర్జీ కాన్ క్లేవ్’ పేరిట నిర్వహించనుంది. ఈ లైవ్ కాన్ఫరెన్స్ అజెండా పలు నూతన వినూత్నతలు, సాంకేతికతలను ప్రతిఫలించనుంది. ఈ కాన్ఫరెన్స్ లో ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. వాటితో పాటుగా సెల్ఫ్ రిలియంట్ ఇండియా, ఇ – హైవేస్, అగ్రి పివి, సోలార్ పివి, బయో ఎనర్జీ, ఇంకా మరెన్నో అంశాలపై ప్రజెంటేషన్స్ వంటి అంశాలపై ప్రజెంటేషన్స్ ఉంటా యి. ముఖ్యమైన సెషన్లలో ‘లివింగ్ విత్ పాండమిక్ – హౌ లీడర్స్ ఆర్ మేకింగ్ సక్సెస్ ఫుల్ కేస్ స్టడీస్’, ‘ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ – యూనిక్ చాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’, ‘ఇ-హైవేస్ ఆర్ ఎకనామిక్ అండ్ గ్రీన్ ఓన్లీ వెన్ పవర్డ్ బై ఆర్ఇ’, ‘యాన్యుటీ హైబ్రిడ్ ఇ-మొబిలిటీ కి సంబంధించి దక్షిణాదిలో రాబోయే ఇ-హైవేస్’, ‘దేశీయ సోలార్ పీవీ తయారీ: స్వయం సమృద్ధ భారత్’, ‘భారత్ లో అగ్రి పివి కి గల వ్యాపారావకాశాలు’, ‘ది పొటెన్షియల్ ఆఫ్ బయోగ్యాస్ బిట్వీన్ డ్రీమ్ అండ్ రియాలిటీ’, ‘యాన్ అప్రోచ్ టువర్డ్స్ మిథేన్ ఎమిషన్ రిడక్షన్’ లాంటివి ఉన్నాయి. 

ఈ ప్రదర్శనకు దీని  ఆల్ సెక్యూర్  అండ్ ట్రావెల్ సెక్యూరిటీ మార్గదర్శకాలు అండగా నిలిచాయి. ఇది ఎగ్జిబిటర్లు, హా జరయ్యే వారు, సందర్శకులు, వక్తలు, స్పాన్సర్లు, కస్టమర్ల కోసం ఇన్ఫార్మాచే చేపట్టబడిన ఒక సురక్షితా ప్రమాణం. నూతన సాధారణతలో ట్రేడ్ ఎగ్జిబిషన్స్ ను భౌతికంగా నిర్వహించేందుకు ఇది ప్రవేశపెట్టబడింది. వివరణాత్మక మెరు గుపర్చబడిన చర్యలను ఇది కలిగిఉంది. ఆల్ సెక్యూర్ అనేది ఈ ప్రదర్శనకు హాజరయ్యే వారికి వారు ఒక సురక్షిత, నియంత్రిత వాతావరణంలో పాల్గొంటున్నారనే విశ్వాసాన్ని, హామీని అందిస్తుంది. ఈ అంతర్జాతీయ ప్రొటొకాల్స్ అనే వి భౌతిక దూరం, రక్షణ, గుర్తించడం, పరిశుభ్రం చేయడం, ఈ సూత్రాలపై వివరంగా ప్రచారం చేయడం లాంటివాటిని కలిగిఉంటాయి.