Fri. Apr 19th, 2024
Corona


365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,
ఢిల్లీ ,డిసెంబర్ 6 2020: :భారతదేశం మొత్తం యాక్టివ్ కేసు లోడ్ ఈ రోజు గణనీయంగా 4.03 లక్షలకు (4,03,248) పడిపోయింది. 138 రోజుల తరువాత ఇది అతి తక్కువ. 2020 జూలై 21 న మొత్తం క్రియాశీల కేసులు 4,02,529.గత తొమ్మిది రోజుల ధోరణిని కొనసాగిస్తూ, గత 24 గంటలలో రోజువారీ కొత్త కేసుల కంటే రోజువారీ రికవరీలను భారతదేశం ఎక్కువగా నమోదు చేసింది. రోజువారీ కేసుల కంటే ఎక్కువగా రోజువారీ రికవరీల ధోరణి భారతదేశం క్రియాశీల కేసుల సంఖ్యను నిరంతర తగ్గేలా చేసింది, ప్రస్తుతం ఇది మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 4.18% మాత్రమే ఉంది.

WhatsApp Image 2020-12-06 at 10.33.28 AM (1).jpeg

భారతదేశంలో 36,011 మందికి కోవిడ్ సోకినట్లు గుర్తించగా, అదే కాలంలో 41,970 కొత్త రికవరీలు నమోదు అయ్యాయి. కొత్త రికవరీలు మొత్తం యాక్టివ్ కేసులలో 6,441 నికర క్షీణతకు దారితీశాయి.

WhatsApp Image 2020-12-06 at 10.27.35 AM.jpeg
India's Active Caseload further contracts to 4.03 Lakh after 138 days
India’s Active Caseload further contracts to 4.03 Lakh after 138 days

భారత్ లో ప్రతి మిలియన్ జనాభాకి కొత్త కేసులు గత వారం రోజుల్లో 186 నమోదయ్యాయి . ఇది ప్రపంచంలోనే అల్పంగా నమోదైన దేశాల్లో ఒకటి.

WhatsApp Image 2020-12-06 at 10.33.28 AM.jpeg

కొత్త కేసులను మించి కొత్త రికవరీలలో వ్యత్యాసం ఈ రోజు రికవరీ రేటును 94.37 శాతానికి పెంచింది. మొత్తం కోలుకున్న కేసులు 91 లక్షలు (91,00,792) దాటాయి. కోలుకున్న కేసులు, క్రియాశీల కేసుల మధ్య అంతరం నేడు 87 లక్షలకు (86,97,544) చేరుకుంటుంది. కొత్తగా కోలుకున్న కేసులలో 76.6% 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించారు. మహారాష్ట్ర గరిష్టంగా ఒక్క రోజులో కొత్తగా కోలుకున్న 5,834 కేసులను నమోదు చేసింది. కేరళ 5,820 కొత్త రికవరీలతో దగ్గరగా ఉంది. ఢిల్లీ 4,916 కొత్త రికవరీలను నమోదు చేసింది.

WhatsApp Image 2020-12-06 at 10.12.17 AM.jpeg

కొత్త కేసుల్లో 75.70% 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండే  నమోదయ్యాయి.

కేరళ రోజువారీ కేసుల్లో అత్యధికంగా 5,848 నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర 4,922, ఢిల్లీ 3,419 కేసులు అత్యధికంగా నమోదైన వాటిలో ఉన్నాయి. 

WhatsApp Image 2020-12-06 at 10.12.14 AM.jpeg

గత 24 గంటల్లో 482 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా సంభవించిన మరణాలు 79.05% పది రాష్ట్రాలు / యుటిల నుండే ఉన్నాయి. . మహారాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం జరిగింది (95). ఢిల్లీలో 77, పశ్చిమ బెంగాల్ లో 49 మరణాలు నమోదయ్యాయి.

WhatsApp Image 2020-12-06 at 10.12.16 AM.jpeg

ప్రపంచవ్యాప్తంగా పోల్చితే గత వారంలో రోజువారీ నమోదైన మరణాలు భారతదేశంలో మిలియన్ జనాభాకు 3 మరణాలు నమోదై అత్యల్పంగా ఉన్నాయని నిరూపించాయి.