Thu. Mar 28th, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 29, 2022:భార‌త్‌తో రెండు ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్‌) డిజిట‌ల్ మంత్రుల (ఎడిజిమిన్‌) స‌మావేశం వ‌ర్చువ‌ల్ వేదిక ద్వారా నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌మ్యూనికేష‌న్ల స‌హాయ మంత్రి (ఎంఒఎస్‌సి) దేవుసిన్హ చౌహాన్‌, మ‌య‌న్మార్ ర‌వాణా, క‌మ్యూనికేష‌న్ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన అడ్మిర‌ల్ టిన్ ఆంగ్ సాన్ స‌హ అధ్య‌క్ష‌త వ‌హించారు. 


ప‌ది ఆసియ‌న్ (అసోసియేష‌న్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియ‌న్ నేష‌న్స్‌) దేశాలు – బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్‌, మ‌లేషియా, మ‌య‌న్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగ‌పూర్‌, థాయ్‌లాండ్ , వియ‌త్నాం తో పాటుగా డైలాగ్ భాగ‌స్వామ్య దేశాలు – ఆస్ట్రేలియా, కెనెడా, చైనా, ఇయు, ఇండియా, జ‌పాన్‌, రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా, న్యూజీలాండ్‌, ర‌ష్యా, యుకె, యుఎస్‌ల‌తో కూడిన ఎడిజిఎంఐఎన్ అన్న‌ది టెలికాం మంత్రుల వార్షిక స‌మావేశం. ప్రాంతీయ డిజిట‌ల్ స‌హ‌కారాన్ని డిజిట‌ల్ క‌లుపుకుపోవ‌డం, స‌మైక్య‌త‌ల స్ఫూర్తితో బ‌లోపేతం చేసేందుకు స‌హేతుక‌మైన వివిధ అంశాల‌ను స‌మావేశం చ‌ర్చ‌లు నిర్వ‌హించింది. 


డిజిట‌ల్ మంత్రుల స‌మావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, స‌మాచార‌, క‌మ్యూనికేష‌న్ సాంకేతిక‌త‌లు ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య పెరిగిన సంప్ర‌దింపులను పెంచి ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ల‌ను,సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు తోడ్ప‌డ‌తాయ‌ని దేవుసిన్హ్ చౌహాన్ ఉద్ఘాటించారు. ఐసిటిలు వాక్ స్వాతంత్య్రాన్ని, మాన‌వ హ‌క్కుల‌ను, స‌మాచారం ఆటంకాలు లేకుండా ప్ర‌సారం కావ‌డాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కాక  నిర్ణ‌యాలు చేసే ప్ర‌క్రియ‌లో పాల్గొనేందుకు పౌరుల అవ‌కాశాల‌ను విస్త‌రించి, గ్రామీణ ప్రాంతాల‌లో జీవించే ప్ర‌జ‌ల జీవితాల‌ను ప‌రివ‌ర్త‌న‌కు లోను చేయ‌గ‌ల సంభావ్య‌త‌ను క‌లిగి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 


దేశ అభివృద్ధికి వివిధ సాంకేతిక ప‌రిష్కారాల‌ను వినియోగించుకోవాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త‌ను మంత్రి గుర్తు చేసుకున్నారు. కోవిడ్‌-29 కేవ‌లం ప్ర‌జా ఆరోగ్య వ్య‌వస్థ‌కు మాత్ర‌మే స‌వాలు కాద‌ని, అది దేశాల ఆర్థిక‌, సామాజిక వ్య‌వ‌స్థ‌ల‌ను కుదిపివేస్తోంద‌ని శ్రీ దేవుసిన్హ చౌహాన్ త‌న ప్ర‌సంగంలో అభిప్రాయప‌డ్డారు. ఈ ప‌రిస్థితుల్లో స‌మాచార‌, క‌మ్యూనికేష‌న్ సాంకేతిక‌త‌లు (ఐసిటిలు) ప్ర‌జా జీవితంలోని వివిధ రంగాల‌లో మ‌హ‌మ్మారి  ప్ర‌భావాల‌ను నిర్మూలించేందుకు బ‌ల‌మైన ప‌రిక‌రాలుగా ఉద్భ‌వించాయ‌ని, అవే అంత‌ర్జాతీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు పునాదులు కూడాన‌ని అన్నారు. 


మంత్రుల స‌మావేశం ఇండియా- ఆసియాన్ డిజిట‌ల్ వ‌ర్క్ ప్లాన్ 2022ను ఆమోదించింది. ఈ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లో దొంగలించిన‌, న‌కిలీ మొబైల్ హాండ్‌సెట్లు, దేశ‌వ్యాప్త బ‌హిరంగ ఇంట‌ర్నెట్‌కు వైఫై ఆక్సెస్ నెట్ వ‌ర్క్, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), 5జి, అడ్వాన్స్‌డ్ శాటిలైట్ క‌మ్యూనికేష‌న్‌, సైబ‌ర్ ఫారెన్సిక్స్ త‌దిత‌రాలు స‌హా స‌మాచార‌, క‌మ్యూనికేష‌న్ సాంకేతిక‌త‌లు క్షేత్రం స‌హా ఉద్భ‌విస్తున్న రంగాల‌లో జ్ఞాన మార్పిడి వంటి అంశాలు ఉన్నాయి.  ప్ర‌స్తుతం న‌డుస్తున్న, ఒక‌రి బ‌లాల‌ను మ‌రొక‌రు ప‌రిపూర‌కం చేస్తూ ప్ర‌తిపాదిత ఐసిటి ప్రాజెక్టులు భార‌త్‌, ఆసియ‌న్ మ‌ధ్య స‌హకారాన్ని బ‌లోపేతం చేస్తాయి.