Fri. Apr 19th, 2024
driving license

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్1,2022: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగు స్తుందా? అయితే మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాల్సిందే. లేదంటే ఏడాది లోపైనా రెన్యూ వల్తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ వ్యవధి కూడా దాటితే ఇక అంతే సంగతులు.

మళ్లీ ప్రాసెస్ మొదటి నుంచి షురూ చేయాల్సి ఉంటుంది. పరీక్ష హాజరు నుంచి ట్రాక్ పై డ్రైవింగ్ టెస్ట్ చేసే వరకు అన్ని టెస్టుల్లో పాల్గొని మీ పనితీరును నిరూపించుకోవాల్సి ఉంటుంది.

గ్రేటర్ ఉప్పల్, మేడ్చల్, కొండాపూర్, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఒక్కో ట్రాక్కు ఒక రోజుకు సుమారు 180 మందికి పైగా వాహన దారులు డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతుంటారు. ఈ లెక్కన నెలకు సుమారు 300 వేలకు పైగా వాహనదారులు లైసెన్స్ సేవలు వినియోగించు కుంటున్నారు.

driving license

ఇందులో లైసెన్స్ గడువు ముగిసి, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు నెలకు 10- 14వేల మంది ఉంటున్నారని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వీరందరూ డ్రైవింగ్ టెస్ట్లో కీలకమైన మలుపులు, యూటర్న్, రైట్ టర్న్, ఎనిమిది సింబల్.. తదితర డ్రైవింగ్ పరీక్షల్లో మరోసారి నిరూపించు కోవాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.

లైసెన్స్ గడువు ముగిసినా డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఆర్టీఏ నిబంధనల ప్రకారం లైసెన్స్ గడువు ముగియకముందే రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 40 ఏళ్లుదాటిన వాళ్లు హెల్త్ ఫిట్నెస్ రిపోర్ట్ కూడా జత చేయాల్సి ఉంటుందని, ఆన్లై న్లో సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..
వాహనదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఎందుకంటే..?
కెఎస్.జవహర్ రెడ్డి ప్రొఫైల్..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..

సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్