Fri. Apr 19th, 2024
southern residential real estate market in Q2
southern residential real estate market in Q2
southern residential real estate market in Q2

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,జూలై 7,2021:కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వృద్ధి చెందిన వేళలో దేశవ్యాప్తంగా గృహ డిమాండ్‌ పరంగా తీవ్రమైన ఒత్తిడి కనిపించినప్పటికీ హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ స్ధిరంగా సానుకూల వృద్ధిని సాధించింది.రియల్‌ ఇన్‌సైట్‌ (రెసిడెన్షియల్‌ ) ఏప్రిల్‌–జూన్‌ (క్యు2) 2021 అంటూ విడుదల చేసిన నివేదికలో సరాసరిన దక్షిణ భారతదేశపు మార్కెట్‌లో ఆస్తుల విలువ 5% ఏప్రిల్‌ –జూన్‌ 2021 కాలంలో పెరిగింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో నిర్మాణంలో ఉన్న గృహాల సరాసరి చదరపు అడుగు ధరతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో అత్యధికంగా ధరలు ఉన్నాయి.‘‘కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం చాలా మార్కెట్‌లలో అధికంగా ఉన్నప్పటికీ, కొన్ని మార్కెట్‌లలో ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లుగా కనబడింది. ఇది ధరల వృద్ధి పరంగానూ ప్రతిబింబించింది, హైదరాబాద్‌లో నూతన ఆవిష్కరణల పరంగానూ కనిపించింది’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌,ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

southern residential real estate market in Q2
southern residential real estate market in Q2

ఆవిష్కరణల పరంగా వార్షిక, త్రైమాస వృద్ధి హైదరాబాద్‌ నగరంలో మాత్రమే కనిపించింది. అమ్మకాల సంఖ్య పరంగా వార్షిక వృద్ధి సైతం పెరిగింది.దక్షిణ భారతదేశపు మార్కెట్‌లో మొత్తంమ్మీద 8,811 నూతన యూనిట్లను ఆవిష్కరించారు. వీటిలో 51% పైగా నూత గృహాలు 75 లక్షల రూపాయలధరలో ఉన్నాయి.రెండవ త్రైమాసంలో 2,429 యూనిట్లను విక్రయించడం ద్వారా 121% వృద్ధిని వార్షికంగా హైదరాబాద్‌ నమోదు చేయడంతో పాటుగా త్రైమాస పరంగా 69% క్షీణతను నమోదు చేసింది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతం ఇప్పటికీ డిమాండ్‌లోనే ఉంది.ఇక అమ్ముడు కాకుండా ఉన్న గృహ యూనిట్ల సంఖ్య హైదరాబాద్‌లో ఇప్పటికీ తక్కువగానే ఉంది. జూన్‌ 30 నాటికి నగరంలో 45,573 యూనిట్లు మాత్రమే అమ్ముడు కాని యూనిట్లు ఉన్నాయి.