Fri. Mar 29th, 2024
Hyderabad man rescues more than 70000 injured animals

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్ డిసెంబర్,13,2020:గ్రామంలో పుట్టి పెరిగిన ప్రదీప్ నాయర్ కు ప్రకృతితో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన బి.టెక్ పూర్తిచేసుకున్న తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు. పెద్ద నగరాలలో జంతువుల దుస్థితి ఆయనను ఎంతో నొప్పించింది. ఆయన జంతువులను బావులలో, గొయ్యిలలో పడడం, పక్షులు మాంజాలలో చిక్కుకుపోవడం చూసారు. ఆయన ఎన్నో సంస్థలకు తన సేవలను అందించారు. కానీ, జంతు రక్షణకు అవసరమైన శిక్షణ చాలా తక్కువ మందికి ఉందని గమనించారు. అప్పటి నించి, ఆయన కష్టలలో ఉన్న జంతువులను రక్షించడానికి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదిచారు. ప్రదీప్ మాట్లాడుతూ, “ఒక రోజు, ఒక చిన్న బావి లో గర్భంతో ఉన్న కుక్క పడిపోయిందని మాకు ఫోను వచ్చింది. మేము వెళ్ళి మెల్లగా దాన్ని రక్షించి, దాన్ని ఒక షెల్టర్కు పంపాము. ఒక వారం తరువాత, అది 2 – 4 పిల్లలకు జన్మనిచ్చింది. అది నా జన్మలో అన్నిటికంటే మధురమైన అనుభూతి. అవి నా పిల్లలు అని నేను భావిస్తాను.” ప్రదీప్ “ఆనిమల్ వారియర్స్ ఇండియా” ని 2015లో ఎన్నో మూగ జంతువులకు సహాయం అందించడానికి స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం మరింత మంది యువకులను నిజమైన జంతు సమ్రక్షణా కార్యకర్తలను రూపుదిద్దడం. ఆయన మంచి శిక్షణను కల్పించి, 18 మంది రక్షకులను తయారు చేసారు. వీళ్ళు నగరంలో ఉన్న సంస్థలతో పని చేస్తూ ఉంటారు. “పాకెట్ షెల్టర్” అనే వినూత్న పద్ధతిని స్థాపించారు. జంతు సమ్రక్షణా సంస్థలపై భారాన్ని తగ్గించడానికి, ఆయన రక్షించిన జంతువులను కొందరి ఇళ్ళలో పెట్టి, వాటిని రక్షిస్తారు. దీనివల్ల నగర పౌరులలో ఒక బాధ్యతను కలింగించగలము అని ఆయన నమ్ముతున్నారు. గత 14 సంవత్సరాలలో,పిల్లులు, కుక్కలు, బర్రెలు, పక్షులు, పాములు వంటి 7000కు పైగా జంతువులను రక్షించారు. 

Hyderabad man rescues more than 70000 injured animals
Hyderabad man rescues more than 70000 injured animals

ప్రదీప్,ఆయన సంస్థలోని రక్షకులు కలిసి ప్రకృతి వైపరిత్యాలలో జంతువులను రక్షిస్తారు. వైజాగ్ తుఫాను, కేరళ వరదలలో ఎన్నో మూగ జీవులను రక్షించారు. భారత దేశంలో లాక్ డౌన్, మొదలైనప్పటినించి, నలుమూల ప్రాంతాలలో,  పర్యాటక ప్రాంతాలలో ఉన్న జంతువులకు ఆహారం అందిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలలో వారు రక్షణకు వాడే పరికరాలు పాతగా అయిపోవడం వల్ల, ప్రదీప్ వారి 3 టీంలకు కావలసిన పరికరాలు, ప్రత్యేక వాహనాలు సేకరించాలని అనుకుంటున్నారు. నిధుల కొరత ఉన్నా, ప్రదీప్ నిరాశ పడలేదు. ప్రపంచంలోని జంతు ప్రేమికుల నించి సహాయం పొందడానికి ఆయన దక్షిణ ఆసియాలోని అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాం మిలాప్లో కాంపైన్ మొదలు పెట్టారు.